Rahul Gandhi: సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి వెళ్లి సమీక్షించాలని రాహుల్ గాంధీ అన్నారు. జడ్చర్ల కార్నర్ మీటింగ్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రసంగించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు ఒకదాని తర్వాత ఒకటి కుంగిపోతున్నాయని రాహుల్ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలను పెంచి, లక్ష కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారని ఆయన ఆరోపించారు. లక్ష కోట్ల రూపాయల ప్రజాధనంతో ప్రాజెక్టును కూడా సరిగా నిర్మించలేకపోయారని విమర్శలు గుప్పించారు. గ్రెస్ పార్టీ నాగార్జున సాగర్, సింగూరు, శ్రీరాంసాగర్, ప్రియదర్శిని జూరాల వంటి అనేక ప్రాజెక్టులను నిర్మించిందని రాహుల్ తెలిపారు.
Also Read: CM KCR : దళితబంధు పుట్టించిన మొగోడు కేసీఆర్
దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరగబోతున్నాయని రాహుల్ పేర్కొన్నారు. తెలంగాణలో ఆదాయం వచ్చే శాఖలు అన్నీ కేసీఆర్ కుటుంబం చేతిలో ఉన్నాయని ఆయన విమర్శలు గుప్పించారు. ఎక్కువ దోపిడి ఏ శాఖలో జరుగుతుందో మీకు తెలుసని ప్రజలను ఉద్దేశించి ఆయన చెప్పారు. ఎక్కువ దోపిడీ ఇసుక, లిక్కర్, భూమిలో జరుగుతుందని.. ఇవన్నీ కేసీఆర్, ఆయన పరివారం చేతిలోనే ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు జరిగిన దోపిడీ చాలదు అన్నట్టు… ఇంకా దోపిడీ చేయాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్కొక్కటి కూలిపోతుందని పేర్కొన్న రాహుల్.. కేసీఆర్ అక్కడికి వెళ్లి సమీక్ష చేయాల్సి ఉందన్నారు.