అనునిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న విజయారెడ్డి ఈసారి ఎమ్మెల్యేగా గెలుస్తారని కొన్ని సర్వే ఏజెన్సీలు చెబుతున్నాయని.. అది నిజం కాబోతుంది అంటున్నారు విజయారెడ్డి అనుచరులు..
2024లో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు.. ఆంధ్రప్రదేశ్‌ఖి ప్రత్యేక హోదా వస్తుంది అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచందర్‌రావు.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధిస్తుంది.. ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.
Assembly election 2023: మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 7న మిజోరంలో ఎన్నికలు జరగనున్నాయి.
Assembly election 2023: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఢిల్లీలోని ఆకాశవాణి భవన్‌లో ఎన్నికల సంఘం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు మాట్లాడుతూ.. గడిచిన 9 సంవత్సరాలుగా గ్యాస్ సిలిండర్ రేటును పెంచుతూ పోయిన కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు వచ్చే సరికి గ్యాస్ సిలిండర్ రేటును 200 రూపాయలు తగ్గిస్తున్నట్లు ప్రకటించడం హాస్యాస్పదమని వీహెచ్ అన్నారు. తాను కూడా బీసీనే అని చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోడీ.. బీసీలకు ఎలాంటి న్యాయం చేయలేదని ఆయన విమర్శించారు.
డాక్టర్ వృత్తిలో ఉన్న కుటుంబం వృత్తిని వదులుకొని సేవ భావంతో బీజేపీలోకి రావడం సంతోషకరంగా ఉందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ళ పాలనలో అభివృద్ధిని చూసి దేశం గర్వ పడుతోంది అని ఆయన పేర్కొన్నారు.
మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ లో శాశ్వతంగా పరిసర గ్రామలను తొలగించకుంటే రాబోయే ఎన్నికల్లో గ్రామీణ ప్రాంత రైతులు మీకు బుద్ది చెపుతారు.. జగిత్యాలలో యావర్ రోడ్ గతంలో 40 ఫీట్లుగా ఉండే రోడ్డును 60 ఫీట్లుగా అభివృద్ధి చేశాను అని జీవన్ రెడ్డి అన్నారు. యావర్ రోడ్ వెడల్పులో TDRను స్వాగతిస్తున్నాను..