MLA Lakshma Reddy: ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు జడ్చర్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మారెడ్డి.. నియోజకవర్గంలోని వివిధ గ్రామాలు, సంఘాలు, ఆయనకు మద్దతు పలుకుతున్నాయి.. ఇక, ఈ మధ్యే జడ్చర్ల వేదికగా సీఎం కేసీఆర్ బహిరంగ సభ జరగడంతో.. నియోజకవర్గంలో కొత్త ఊపు వచ్చింది.. అది ఏ మాత్రం తగ్గకుండా.. తన ప్రచారాన్ని మరింత విస్తృతం చేశారు లక్ష్మారెడ్డి.. ఇదే సమయంలో.. లక్ష్మారెడ్డి చేసిన అభివృద్ధిని చూసి వివిధ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరుతున్నారు. తాజాగా, బీఆర్ఎస్ పార్టీలో చేరారు గౌతాపూర్ ఉడిత్యాలకు చెందిన, కాంగ్రెస్, బీఎస్పీ నాయకులు.
Read Also: Share Market Opening: దేశీయ మార్కెట్‌పై గ్లోబల్ ప్రెజర్.. నష్టాలతో ప్రారంభైన సెన్సెక్స్, నిఫ్టీ
9 ఏళ్లలో జడ్చర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికే మా మద్దతు అంటున్నారు.. బాలానగర్ మండలం గౌతాపూర్ కు చెందిన 10 మంది బీఎస్పీ నాయకులు, ఉడిత్యాలకు చెందిన 10 మంది కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అభివృద్ధి మరియు ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని, జడ్చర్ల నియోజకవర్గంలో లక్ష మెజార్టీ దిశగా ప్రతి ఒక్కరు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాగా, ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో లక్ష్మారెడ్డిని గెలిపిస్తామని.. ఆ దిశగా తమ కృషి కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.
మరోవైపు.. నవాబుపేట మండలం కారుర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది నేతలు, కార్యకర్తలు.. ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.. ఈ సందర్భంగా వారందరు బీఆర్ఎస్ తోనే బంగారు తెలంగాణ సాధ్యమని.. జడ్చర్ల సమగ్రాభివృద్ధికై లక్ష్మన్న వెంట నడవడానికి తాము సిద్ధంగా ఉన్నామని.. భారీ మెజార్టీతో లక్ష్మారెడ్డి విజయం కోసం తమ వంతు కృషి చేస్తామని ప్రకటించారు.