తెలంగాణలో కూడా ఉద్యోగుల డిమాండ్ మేరకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తామని చెప్పారు. తెలంగా ణలో ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక కిలో బియ్యం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తుంటే మిగతా 5 కిలోలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
జనగామ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య ప్రజా ప్రతినిధులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు తన వెంట ఉన్న వారు లింగాల గణపురం మండలం కేంద్రంలో జరిగిన షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో హాజరు కాకపోవడం వారిపై ఆయన పరోక్షంగా చురకలాంటించారు.
బీజేపీ ఉమ్మడి మెదక్ జిల్లాలో రేపటి ఎన్నికల కోసం సిద్ధం అవుతుంది అని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తున్నారు..
పెట్రోల్, డీజిల్ ధరలు కేంద్రం తగ్గించి రాష్ట్రాలను కూడా తగ్గించమని కోరితే ఈ రాష్ట్ర ప్రభుత్వం తగ్గించలేదు అని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. పెట్రోల్ ధర అత్యధికంగా తెలంగాణలోనే ఉంది అని ఆయన ఆరోపించారు.
వికాస్ రావు డాక్టర్ గా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు అని బండి సంజయ్ అన్నారు. మంచి ఆలోచనతో, బీజేపీపై నమ్మకంతో చేరుతున్నందుకు ధన్యవాదాలు.. కిషన్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాషాయ జండా ఎగరడం ఖాయం అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అన్నారు.
MP Komatireddy: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యులతో పాటు ఇతర సీనియర్లను కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆహ్వానించారు.