జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జగిత్యాల యవర్ రోడ్ ను 3 నెలల్లో వెడల్పు చేస్తాను అని ప్రకటించారు. మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ లో శాశ్వతంగా పరిసర గ్రామలను తొలగించకుంటే రాబోయే ఎన్నికల్లో గ్రామీణ ప్రాంత రైతులు మీకు బుద్ది చెపుతారు.. జగిత్యాలలో యావర్ రోడ్ గతంలో 40 ఫీట్లుగా ఉండే రోడ్డును 60 ఫీట్లుగా అభివృద్ధి చేశాను అని జీవన్ రెడ్డి అన్నారు. యావర్ రోడ్ వెడల్పులో TDRను స్వాగతిస్తున్నాను.. TDRతో పాటు 50 కోట్ల రూపాయలు అదనంగా ఇస్తే సమస్య పరిష్కారం అవుతుంది అని అన్నారు.
Read Also: Indian Tech Worker: కెనడా బాట పట్టిన భారత టెక్కీలు.. 12 నెలల్లో 15 వేల మంది..
గతంలో 40 ఫీట్లుగా ఉన్న యావర్ రోడ్డును ప్రజల సహకారంతో 60 ఫీట్ల రోడ్ గా మార్చాను అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. 2009లో యావర్ రోడ్ విస్తరణకు ప్రయత్నం చేశాను.. కానీ ప్రజలు కోర్ట్ కి పోవడంతో చేయలేకపోయాను అని అన్నార. జగిత్యాల పట్టణంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు జిల్లా కేంద్రం చుట్టూ బైపాస్ రోడ్లు ఏర్పార్చాము అని పేర్కొన్నారు. 2014లో యావర్ రోడ్ విస్తరణ 60 ఫీట్ల నుంచి 100 ఫీట్లకు చేసేందుకు అనుమతి కోరుతూ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కి విన్నవించాము అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పుకొచ్చాడు.
Read Also: Tiger Nageswara Rao: టైగర్ నాగేశ్వరరావు ప్రొడ్యూసర్ కి హైకోర్టు నోటీసులు
రాజకీయ లబ్ది కోసమే 2014లో యావర్ రోడ్ విస్తరణను అనుమతించలేదు అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. గడిచిన నాలుగు సంవత్సరాలలో కేవలం ప్రభుత్వ కార్యాలయల వద్ద రోడ్ వెడల్పు చేసి ప్రైవేట్ స్థలాల వద్ద ఎందుకు చేయలేదు అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల్లో మౌలిక సదుపాయాల కోసం సీఎం ప్రత్యేకంగా అభివృధి నిధిని ఏర్పాటు చేశారు.. సీఎం కేసీఆర్, కేటీఆర్ కి జగిత్యాలపై ప్రత్యేకమైన అభిమానం ఉంది.. యావర్ రోడ్ వెడల్పుకు కేటీఆర్ హామీ ఇచ్చి మరిచారు అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. సీఎం ప్రత్యేక అభివృద్ధి నిధితో 50 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే.. నాలుగు రోజుల్లో జగిత్యాలలో యవర్ రోడ్ సమస్య పరిష్కరము అవుతుందని జీవన్ రెడ్డి తెలిపారు.