ఈ నెల 22న అయోధ్యలో రాంలాలా ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి సన్నాహాలు తుది దశకు చేరుకున్నాయి. ఆలయ కమిటీ ద్వారా ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు. అయితే రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం విషయంలో అనేక విమర్శలు వస్తున్నాయి. తాజాగా, బీహార్ ప్రభుత్వంలో మంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. నా కలలోకి రాముడు వచ్చి.. జనవరి 22న అయోధ్యకు వెళ్లబోమని చెప్పారు అని ఆయన పేర్కొన్నారు.
Read Also: HanuMan : హనుమాన్ మూవీ టీం ను ప్రశంసించిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు..
అయితే, ఒక్కసారి ఎన్నికలు అయిపోతే, శ్రీరామచంద్రుడ్ని అందరు మరిచిపోతారు.. అలాంటప్పుడు జనవరి 22వ తేదీన అయోధ్యకు రావడం అవసరమా? అని శ్రీరాముడు నాతో చెప్పాడు అని తేజ్ ప్రతాప్ యాదవ్ పేర్కొన్నారు. అయోధ్యలో కపటనాటకం నడుస్తుంది.. కాబట్టి నేను రావట్లేదని ఆయన వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ సందర్భంగా బీజేపీపై తేజ్ ప్రతాప్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ వాళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. దేశంలోని నలుగురు శకంరాచార్యుల కలలో కూడా రాముడు కనిపించాడు అనే విషయాన్ని చెప్పాడు.. గత కొన్ని రోజుల క్రితం అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ఠా వేడుకలకు వెళ్లడం గురించి అడిగినప్పుడు.. మేము శ్రీకృష్ణుని భక్తులం.. బృందావనం వెళ్తామని తేజ్ ప్రతాప్ యాదవ్ చెప్పాడు. అయితే, వైరల్ అవుతున్న తేజ్ ప్రతాప్ యాదవ్ వ్యాఖ్యలపై బీజేపీ ఎలా స్పందిస్తుందో అనేది ప్రస్తుతం ఆసక్తి నెలకొంది.
Ram ji has come in my and 4 Shankracharyas dream that he will not come on 22nd January- Tejpratap Yadav pic.twitter.com/N36HRqaAB3
— Megh Updates 🚨™ (@MeghUpdates) January 14, 2024