అగ్నిబాన్ మిషన్ ప్రయోగం వాయిదా పడింది. దేశంలోనే ప్రైవేట్ రంగంలో రెండో రాకెట్ ప్రయోగానికి శ్రీహరికోటలోని షార్ సిద్ధమైంది. అయితే టెక్నికల్ సమస్యతో ఈ ప్రయోగానికి ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ఈ ప్రయోగాన్ని వాయిదా పడింది. మార్చి 22న తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది. అయితే సాంకేతిక సమస్యలతో ఈ ప్రయోగం వాయిదా పడింది. లాంచింగ్ డేట్ త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం మార్చి 22న జరగాల్సి ఉంది.
స్పేస్ స్టార్టప్ సంస్థ అగ్నికుల్ కాస్మోస్ ప్రైవేట్ లిమిటెడ్ తన మొదటి రాకెట్ అగ్నిబాన్‌ను సిద్ధం చేసింది. 3డీ ప్రింటింగ్ విధానంలో రూపొందించిన ఇంజిన్‌ను ఈ రాకెట్‌కు అమర్చారు.
అగ్నికుల్ కాస్మో్‌స, మద్రాసు ఐఐటీ స్పేస్ టెక్నాలజీ స్టార్టప్ తరపున సబ్ ఆర్బిటల్ రాకెట్‌ను రూపొందించి షార్ నుంచి ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేస్తుకున్నారు. అగ్నికుల్ ప్రయోగ వాహకనౌకకు అగ్నిబాన్ సబార్బిటల్ టెక్నాలజీ డెమాన్‌స్ర్టేటర్‌గా నామకరణం చేశారు. ప్రస్తుతం ప్రయోగ వేదిక రాకెట్‌కు పలు తనిఖీలు కూడా చేశారు. ఇది అగ్నిలెట్ ఇంజన్‌తో నడిచే సింగిల్ స్టేజ్ వాహక నౌక. ఈ సెమీ క్రయోజనిక్ ఇంజన్‌ను పూర్తిగా 3డీ సాంకేతికతతో రూపొందించారు. 6కేఎన్ సామర్ధ్యాన్ని కలిగిన ఈ రాకెట్‌లో 300 కిలోల పేలోడ్‌తో 700 కిలోమీటర్ల దూరంలో పంపే విధంగా డిజైన్ చేశారు. షార్‌లో అగ్నికుల్‌కు చెందిన సొంత ప్రయోగ వేదిక, మిషన్ కంట్రోల్ సెంటర్‌ను గత ఏడాది ఏర్పాటు చేశారు. ఈ రాకెట్‌ను షార్‌లోని ఏఎస్‌ఎల్వీ కాంప్లెక్స్‌లో అనుసంధానం చేశారు.