Delhi Visakhapatnam Flight: ఒక ఎయిర్ ఇండియా విమానానికి ఆకాశంలో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పైలెట్లు విమానాన్ని వెనక్కి మళ్లించి సేఫ్‌గా ల్యాండ్ చేశారు. నివేదికల ప్రకారం.. శుక్రవారం ఢిల్లీ – విశాఖపట్నం మధ్య ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్న ఎయిర్ ఇండియా విమానం AI 451 APU ఢిల్లి నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేపటి తర్వాత ఆకాశంలో సాంకేతిక లోపం తలెత్తింది. సాంకేతిక లోపాన్ని గుర్తించిన వెంటనే పైలెట్లు U-టర్న్ తీసుకొని విమానాన్ని…
రన్‌వేపై టేకాఫ్ కి సిద్ధంగా ఉన్న విమానంలో అకస్మాత్తుగా ఫైర్ అలారం మోగడం ప్రారంభమైంది. దీంతో విమానం లోపల గందరగోళం నెలకొంది. ప్రయాణికులు ఏదో విధంగా విమానం నుంచి బయటపడటానికి ప్రయత్నించారు. విమానంలోని ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటకు వచ్చి విమానం రెక్కలపైకి ఎక్కి కిందకు దూకారు. రెక్కలపైకి ఎక్కి రన్‌వేపైకి దూకుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు కలవర పెడుతున్నాయి. తాజాగా జపాన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. అసోసియేటెడ్ ప్రెస్ (AP) ప్రకారం.. జపాన్ ఎయిర్‌లైన్స్ విమానం దాదాపు 36,000 అడుగుల ఎత్తు నుంచి అకస్మాత్తుగా కిందికి వెళ్లింది. దీంతో సిబ్బంది వెంటనే ప్రయాణికులకు ఆక్సిజన్ మాస్క్‌లు అందించారు. ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
SpiceJet : ఈ రోజు ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన స్పైస్ జెట్ విమానం (SpiceJet)లో ప్రయాణికులకు కలవరాన్ని కలిగించే సంఘటన చోటుచేసుకుంది. విమానం తిరుపతి దిశగా ప్రయాణిస్తుండగా, ఆకాశంలో ప్రయాణిస్తున్న సమయంలో పైలట్ సాంకేతిక లోపాన్ని గుర్తించడంతో అప్రమత్తమయ్యారు. ఎటువంటి ప్రమాదం జరగకమునుపే, విమానాన్ని వెంటనే తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు తీసుకెళ్లారు. Ahmedabad Plane Crash: కేంద్రం కీలక నిర్ణయం.. కొత్త నిబంధనలు జారీ ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. వారు…
భారత వైమానిక దళానికి చెందిన M17 అపాచీ హెలికాప్టర్ శుక్రవారం అత్యవసరంగా ల్యాండ్ అయింది. సాంకేతిక లోపం, ముందు జాగ్రత్త చర్యలో భాగంగా హెలికాప్టర్‌ను ల్యాండ్ చేసినట్లు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో జరిగిన నష్టంపై అధికారిక సమాచారం అందలేదు. వాస్తవానికి.. పఠాన్‌కోట్ వైమానిక దళ కేంద్రం నుంచి బయలుదేరిన హెలికాప్టర్, సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నట్లు సమాచారం అందడంతో ముందుజాగ్రత్తగా బహిరంగ ప్రదేశంలో ల్యాండ్ అయింది.
విమాన ప్రయాణికులకు ఇటీవల చోటుచేసుకుంటున్న ఫ్లైట్ ప్రమాదాలు భయాందోళన కలిగిస్తున్నాయి. తాజాగా తృటిలో మరో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి ఫ్రాంక్ ఫోర్ట్ వెళ్తున్న లుఫ్తాన్స విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. విమానంలోని ముందు టైరులో సాంకేతిక లోపాన్ని గుర్తించాడు పైలెట్. వెంటనే పైలట్ విమానాన్ని రన్ వే పై దించేశాడు. ఈ సమయంలో విమానంలో 160 మంది ప్రయాణికులు ఉన్నారు. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఘోర ప్రమాదం తప్పినట్లైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం…
Air Force Helicopter: తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలోని పోర్పంధాల్ గ్రామంలో సోమవారం ఉదయం తాంబరం ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి వెళ్తున్న శిక్షణ హెలికాప్టర్( IAF) అత్యవసరంగా ల్యాండ్ అయింది.
నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బయలుదేరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిలు ప్రయాణం చేస్తున్న హెలికాప్టర్ ఒకేరోజు రెండుసార్లు సాంకేతిక లోపంతో నిలిచి పోయింది.
Gurukula Exam: గురుకుల పీజీటీ ఇంగ్లీష్ ఆన్‌లైన్ పరీక్షలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో హైదరాబాద్ హయత్ నగర్ పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులు ఆందోళనకు దిగారు. దీంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.