విమాన ప్రయాణికులకు ఇటీవల చోటుచేసుకుంటున్న ఫ్లైట్ ప్రమాదాలు భయాందోళన కలిగిస్తున్నాయి. తాజాగా తృటిలో మరో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి ఫ్రాంక్ ఫోర్ట్ వెళ్తున్న లుఫ్తాన్స విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. విమానంలోని ముందు టైరులో సాంకేతిక లోపాన్ని గుర్తించాడు పైలెట్. వెంటనే పైలట్ విమానాన్ని రన్ వే పై దించేశాడు. ఈ సమయంలో విమానంలో 160 మంది ప్రయాణికులు ఉన్నారు. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఘోర ప్రమాదం తప్పినట్లైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం చోటుచేసుకోకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. సాంకేతిక లోపానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.