భారత వైమానిక దళానికి చెందిన M17 అపాచీ హెలికాప్టర్ శుక్రవారం అత్యవసరంగా ల్యాండ్ అయింది. సాంకేతిక లోపం, ముందు జాగ్రత్త చర్యలో భాగంగా హెలికాప్టర్‌ను ల్యాండ్ చేసినట్లు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో జరిగిన నష్టంపై అధికారిక సమాచారం అందలేదు. వాస్తవానికి.. పఠాన్‌కోట్ వైమానిక దళ కేంద్రం నుంచి బయలుదేరిన హెలికాప్టర్, సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నట్లు సమాచారం అందడంతో ముందుజాగ్రత్తగా బహిరంగ ప్రదేశంలో ల్యాండ్ అయింది. హెలికాప్టర్ దిగుతున్నట్లు చూసిన గ్రామస్థులు సంఘటనా స్థలానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. కానీ భద్రతా సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. ప్రస్తుతానికి, అత్యవసర ల్యాండింగ్‌కు గల కారణాలపై వైమానిక దళం లేదా జిల్లా యంత్రాంగం ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. సంఘటన స్థలంలో ఉన్న సీనియర్ అధికారులు కార్యాచరణ, భద్రతా ప్రోటోకాల్ నేపథ్యంలో వివరణ ఇవ్వడానికి నిరాకరించారు. ప్రజా భద్రతకు లేదా మౌలిక సదుపాయాలకు ఎటువంటి ముప్పు లేదని అధికారులు హామీ ఇచ్చారు.
READ MORE: Ahmedabad Tragedy: భారతదేశ వ్యాప్తంగా బోయింగ్ 787-8 విమానాలు నిలిపివేత..?
ఇదిలా ఉండగా.. అంతకుముందు జూన్ 6న, భారత వైమానిక దళానికి చెందిన అపాచీ హెలికాప్టర్ ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. కొన్ని గంటల తర్వాత, వైమానిక దళ సాంకేతిక నిపుణుల సహాయంతో హెలికాప్టర్‌ను సహరాన్‌పూర్ వైమానిక స్థావరానికి తిరిగి తీసుకువచ్చారు. అంతకుముందు.. జూన్ 5న కూడా జైసల్మేర్ జిల్లాలోని పిథాలా గ్రామంలో భారత వైమానిక దళం రిమోట్‌గా పైలట్ చేసిన విమానం (మానవరహిత వైమానిక వాహనం) కూలిపోయింది. ఈ ప్రమాదంలో ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని వైమానిక దళం తెలిపింది. ఈ అంశంపై భారత వైమానికి దళం వివరణ ఇచ్చింది. ‘
READ MORE: Wimbledon 2025: భారీగా వింబుల్డన్ ప్రైజ్‌మనీ.. విజేతకు ఎన్ని కోట్లంటే?