Google Layoff: ఆర్థిక మందగమనం, ఆర్థికమంద్యం భయాలు టెక్ కంపెనీల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ఆదాయాలు తగ్గడంతో ఖర్చులను తగ్గించుకునే ఉద్దేశంతో వేల సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నారు. గతేడాది నవంబర్ నుంచి టెక్ సంస్థల్లో లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. ప్రపంచ దిగ్గజ సంస్థలైన గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ ఇలా పలు కంపెనీలు తమ ఉద్యోగులకు స్వస్తి పలికాయి. అయితే ఈ లేఫ్స్ పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది.
Layoffs : ప్రతికూల ఆర్థిక పరిస్థితుల మధ్య ప్రపంచం మొత్తం దాదాపు రెండేళ్లుగా రిట్రెంచ్‌మెంట్‌ను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా టెక్ రంగంలో ఈ రిట్రెంచ్‌మెంట్ తీవ్రంగా ఉంది. ప్రపంచంలోని ప్రఖ్యాత కంపెనీలన్నీ ఖర్చును తగ్గించుకునే పనిలో పడ్డాయి.
Microsoft: టెక్ సంస్థల్లో ఉద్యోగుల లేఆఫ్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాతి చెందిన టెక్ సంస్థలు వేలల్లో ఉద్యోగుల్ని తొలగించాయి. ఇదిలా ఉంటే టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారీ ఎత్తున మరోసారి ఉద్యోగుల్ని తొలగించేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది జనవరిలో 10,000 మందికి పైగా ఉద్యోగుల్ని తొలగించింది మైక్రోసాఫ్ట్. వీటికి అదనంగా మరికొంత మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి వారం నుంచే ఈ తొలగింపులు ప్రారంభించింది.
Layoff problems: ఆర్థికమాంద్యం భయాల వల్ల చాలా కంపెనీలు తమ ఉద్యోగుల్ని తీసేశాయి. ముఖ్యంగా ఐటీ కంపెనీలు వేలల్లో ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఉద్యోగాలు కోల్పోయిన వారు మానసికంగా చాలా వేదన అనుభవిస్తున్నారు. కొందరు ఎన్ని ఉద్యోగాలకు అఫ్లై చేసిన ఉద్యోగం దొరకని పరిస్థితి ఏర్పడింది. స్విగ్గీ నుంచి తొలగించబడిన ఉద్యోగి ప్రతీ రోజు 100 కన్నా ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నానని.. అయితే తనకు ఇప్పటి వరకు ఎలాంటి ఉద్యోగం రాలేదని వెల్లడించారు.
IT hirings: ఆర్థికమాంద్యం భయాలు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం టెక్ కంపెనీలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ప్రపంచ ప్రఖ్యాత దిగ్గజ టెక్ కంపెనీలు కూడా ఖర్చులను తగ్గించుకునేందు తమ ఉద్యోగులను ఎడాపెడా తీసేశాయి.
Tech Layoffs to Continue: 2022 జనవరిలో లేఆఫ్ అనే పదాన్ని గూగుల్‌లో ఐదుగురు మాత్రమే సెర్చ్ చేయగా.. ఈ సంవత్సరం జనవరిలో ఏకంగా వంద మంది సెర్చ్ చేశారు. అంటే.. ఏడాది వ్యవధిలోనే లేఆఫ్ అనే వర్డ్ ఎంత పాపులర్ అయిందో అర్థంచేసుకోవచ్చు. అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ విషయం పెద్దగా ఆశ్చర్యం కూడా కలిగించకపోవచ్చేమో. ఎందుకంటే.. ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా లేఆఫ్ అనే పదమే కనిపిస్తోంది.. వినిపిస్తోంది. కంపెనీలు ఆ రేంజ్‌లో ఉద్యోగులను…
GoDaddy layoff: లేఆఫ్స్ జాబితాలో మరో కంపెనీ కూడా చేరిపోయింది. ప్రముఖ వెబ్ హోస్టింగ్ ప్లాట్ ప్లాట్‌ఫారమ్ గోడాడీ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. తన సిబ్బందిలో 8 శాతం మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. గోడాడీ సీఈఓ అమన్ భూటానీ మాట్లాడుతూ ప్రస్తుతం ఆర్థిక పరిణామాల వల్లే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వెల్లడించారు. సిబ్బందికి పంపిన ఈమెయిల్స్ లో ఈ ఉద్యోగులు తొలగింపుకు కారణాలు వెల్లడించారు.
US Layoffs: ఆర్థిక మాంద్యం భయాలు నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు వరసగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ టెక్ దిగ్గజాలు అయిన గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్, ట్విట్టర్ ఇలా తమ ఉద్యోగులను నిర్ధాక్షిణ్యంగా తొలగించేశాయి. ఆయా కంపెనీలతో దశాబ్ధాల కాలం అనుబంధం ఉన్న ఉద్యోగులను కూడా తొలగించాయి. అమెరికాలో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు ఊడాయి.