Ford Layoff: ఫోర్డ్‌లో భారీగా ఉద్యోగాలు కట్..ఇంజినీర్ల విభాగంలోనే ఎక్కువ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెక్ సంస్థల్లో మొదలైన ఉద్యోగాల కోతలు ప్రతి ఇండస్ట్రీకి విస్తరిస్తున్నాయి. తాజాగా ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ కూడా ఇదే బాటలో వెళ్లనున్నట్లు ప్రకటించింది. వచ్చే మూడేళ్లలో ఐరోపాలో తమ సంస్థలోని 3,800 మంది ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు వెల్లడించింది. ఆర్థికంగా సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో తమ కార్యకలాపాలను గాడిన పెట్టే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మరోవైపు విద్యుత్తు కార్ల విభాగంలో పోటీ ఎక్కువైన కారణంగా ఖర్చులను నియంత్రించుకోనున్నట్లు పేర్కొంది.
Also Read: HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కమిటీని రద్దు చేసిన సుప్రీంకోర్టు
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
జర్మనీలో 2,300 మందిని, యూకేలో 1,300 మందిని, ఐరోపాలోని మిగిలిన ప్రాంతాల్లో మరో 200 మందిని తొలగించనున్నట్లు ఫోర్డ్ తెలిపింది. 2035 నాటికి ఐరోపాలో పూర్తిగా విద్యుత్తు వాహనాలనే విక్రయించాలన్న తమ లక్ష్యాన్ని వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. ఈ ఏడాదిలోనే కంపెనీ ఐరోపాలో తయారు చేసిన తొలి విద్యుత్తు కారును విడుదల చేయనుంది. ఉద్యోగుల తొలగింపును వీలైనంత వరకు ‘వాలంటరీ సపరేషన్ ప్రోగ్రాం’ ద్వారా చేపడతామని తెలిపింది. క్రమంగా విద్యుత్తు వాహన తయారీ దిశగా రూపాంతరం చెందుతున్న నేపథ్యంలో ఇంజినీర్ల సంఖ్య పెద్దగా అవసరం ఉండకపోవచ్చునని ఫోర్డ్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ విభాగంలోనే దాదాపు 2,800 మంది తొలగించాలని యోచిస్తోంది. మిగిలిన 1,000 మందిని పరిపాలనా విభాగాల నుంచి తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఇంజినీరింగ్ విభాగంలో ఇంకా 3,400 మంది ఉంటారని సమాచారం. ఫోర్డ్‌కు ఐరోపాలో మొత్తం 34,000 మంది ఉద్యోగులు ఉన్నారు.
Also Read: Spritual Tourism: దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక టూరిజం అభివృద్ధి
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్‌లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..