Amazon layoffs: ప్రపంచవ్యాప్తంగా టెక్ లేఆఫ్స్ జరుగుతున్నాయి. ఎవరి ఉద్యోగం ఎప్పుడు పోతుందనే భయం టెక్కీలో నెలకొంది. ఇప్పటికే టాప్ టెక్ సంస్థలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఇటీవల అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 14,000 మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, ఈ సంఖ్య 30,000 వరకు చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవల, అమెజాన్ తన ఉద్యోగులకు తెల్లవారుజామున టెక్స్ట్ మెసేజులు చేసి, ఉద్యోగంలో నుంచి పీకేస్తున్నట్లు తెలియజేసింది.
Amazon: టెక్ లేఆఫ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. తాజాగా, అమెజాన్ 14,000 మంది ఉద్యోగుల్ని తీసేసింది. దీనిపై అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ స్పందించారు. ఉద్యోగుల తొలగింపు ‘‘ వర్క్ కల్చర్’’కు సంబంధించిందని చెప్పారు. తొలగింపులు AI కోసం, డబ్బు కోసం కాదని ఆయన స్పష్టం చేశారు.
Tech Layoffs: గ్లోబల్ ఐటీ దిగ్గజ కంపెనీలు వరసగా తమ లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. తమ ఉద్యోగుల్ని తీసేస్తున్నాయి. దీంతో సాఫ్ట్‌రంగంలో ఉద్యోగులకు భద్రత కరువైంది. ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే, ఇలా ఉద్యోగుల్ని తీసేయడానికి టెక్ కంపెనీలు బిలియన్ డాలర్లను ఖర్చు చేస్తున్నాయి. తీసేసిన ఉద్యోగులకు ప్యాకేజీలను అందిస్తున్నాయి. సెవరెన్స్ ప్యాకేజీలు, నోటిస్ పే, అవుట్‌ప్లేస్‌మెంట్ సపోర్ట్, వీసా సాయం, మానసిక ఆరోగ్య సహాయం వంటి వాటికి ఖర్చు చేస్తున్నాయి.
Amazon Layoffs 2025: ప్రముఖ ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది. రాయిటర్స్, బ్లూమ్‌బర్గ్ వంటి అంతర్జాతీయ వార్తా సంస్థల నివేదికల ప్రకారం, ఈసారి సుమారు 30,000 మంది కార్పొరేట్ ఉద్యోగులను లేఆఫ్ చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఇది అమెజాన్ చరిత్రలోనే అతిపెద్ద ఉద్యోగాల కోతగా నిలిచే అవకాశం ఉంది. ప్రస్తుతం అమెజాన్‌లో దాదాపు 3.5 లక్షల కార్పొరేట్ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో సుమారు 10 శాతం మందిని తొలగించేందుకు నిర్ణయించిందని…
Intel layoffs: మరో టెక్ సంస్థ భారీ మొత్తంలో ఉద్యోగుల్ని తొలగించేందుకు సిద్ధమైంది. చిప్‌మేకర్ ‘‘ఇంటెల్’’ పునర్నిర్మాణంలో భాగంగా ఏకంగా 25,000 మంది కన్నా ఎక్కువ ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని భావిస్తోందని ది న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. 2025 చివరి నాటికి తన ఉద్యోగుల సంఖ్యను 75,000 మందికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది చివరి నాటికి ఇంటెల్‌లో మొత్తం 1,08,900 మంది ఉద్యోగులు ఉన్నారు.
మైక్రోసాఫ్ట్ భారీగా ఉద్యోగుల తొలగింపులకు రెడీ అయింది. ప్రపంచ వ్యాప్తంగా తమ సిబ్బందిలో దాదాపు 3 శాతం మేర ఉద్యోగుల లేఆఫ్‌లు ప్రకటించనున్నట్లు పలు రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ నిర్ణయంతో వేలాది మంది ఉద్యోగులపై దీని ప్రభావం పడే ఛాన్స్ ఉంది.
JP Morgan Chase: టెక్ సంస్థల్లో అనిశ్చితి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఇలా ఉద్యోగుల ఉద్వాసనకు కారణమవుతున్నాయి. గత రెండేళ్లుగా టెక్ దిగ్గజాలతో పాటు పలు మల్టీ నేషనల్ కంపెనీలు తమ ఉద్యోగుల్ని తగ్గించుకుంటున్నాయి. తాజాగా, అమెరికన్ మల్టీనేషనల్ బ్యాంక్ JP మోర్గాన్ చేజ్ భారీగా ఉద్యోగుల లేఆఫ్స్‌కి ప్లాన్ సిద్ధం చేసింది. 2025 అంతా ఉద్యోగుల కోతలు ఉంటాయని ప్రకటించిందని పలు నివేదికలు చెబుతున్నాయి.
Infosys Layoffs: గ్యాడ్యుయేషన్ పూర్తయిన వెంటనే సగటు వ్యక్తి ఆశ సాఫ్ట్‌వేర్ జాబ్ సంపాదించడం, లక్షల్లో ప్యాకేజీలు అందుకోవడం, ఫ్లాట్లు, కార్లు ఇలా ఎన్నో ఆశలు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. యువత సాఫ్ట్‌వేర్ ఆశలు ఆవిరి అవుతున్నాయి. గత రెండేళ్లుగా టెక్ కంపెనీలు తమ ఖర్చుల్ని తగ్గించుకునేందుకు వేల సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. తాజాగా, దేశీయ టెక్ దిగ్గజం ‘‘ఇన్ఫోసిస్’’ ఏకంగా 700 మంది ఫ్రెషర్లను ఒకేసారి తొలగించడం సంచలనంగా…
Meta: ఐటీ ఉద్యోగులకు మెడపై కత్తి వేలాడుతోంది. గత రెండేళ్లుగా అగ్రశ్రేణి టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు ‘‘లే ఆఫ్’’ ఇస్తున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా ఇలా పలు కంపెనీలు తమ ఉద్యోగుల్ని తొలగించాయి. ఆర్థిక మాంద్యం భయాలు, ఆదాయం తగ్గడంతో ఖర్చుల్ని తగ్గించుకునేందుకు కంపెనీలు ఉద్యోగులను తీసేశాయి. తాజాగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)కారణంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు రాబోయే కాలంలో ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.
Google Layoffs: టెక్ దిగ్గజం గూగుల్ మరోసారి ఉద్యోగాల కోతను ప్రకటించింది. మేనేజ్మెంట్, వైస్ ప్రెసిడెంట్ లెవల్ స్థాయి ఉద్యోగాల్లో 10 శాతం మందిని తొలగిస్తున్నట్లు గూగుల్ ఈసీఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. వ్యూహాత్మక ప్రాధాన్యతలు, ఆపరేషనల్ ఎఫిషియెన్సీ, సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా ఈ లేఆఫ్స్ ప్రకటించినట్లు తెలుస్తోంది. కొనసాగుతున్న ఆర్థిక సవాళ్ల మధ్య వర్క్‌ఫోర్స్‌ని క్రమబద్దీకరించడానికి ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల నిర్వహించిన ఆల్-హ్యాండ్ మీటింగ్‌లో సుందర్ పిచాయ్ సమర్థతను పెంచడానికి ఉద్యోగాల కోతను…