Ravi Shastri Feels Team India win World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023లో వరుస విజయాలతో సెమీస్‌కు చేరిన భారత్.. లీగ్ దశలో నేడు చివరి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను ఢీ కొట్టనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలుపు ఖాయమే. సెమీస్‌లో న్యూజీలాండ్‌తో తలపడనున్న టీమిండియా.. ట్రోఫీ గెలుస్తుందని అందరూ అంటున్నారు. ఈ క్రమంలో భారత్ వరల్డ్‌కప్ అవకాశాలపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌ను చేజిక్కించుకోవాలని, లేకపోతే…
ప్రపంచకప్ 2023లో టీమిండియా అద్భుత ప్రదర్శన చూపిస్తోంది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ ల్లోనూ అన్నింటిలో గెలిచి పాయింట్ల పట్టికలో నెంబర్ 1 స్థానంలో ఉంది. లీగ్ దశలో కేవలం నెదర్లాండ్స్‌తో మ్యాచ్ మిగిలి ఉంది. ఆ తర్వాత ముంబైలోని వాంఖడే స్టేడియంలో నెంబర్ 4 జట్టుతో భారత్ సెమీఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఇక ఈ వరల్డ్ కప్‌లో టీమిండియా గెలవడమే కాదు.. అన్ని విభాగాల్లోనూ మంచి ప్రదర్శనను చూపిస్తుంది. దీంతో ప్రత్యర్థి జట్లను ఓడించి ఏకపక్షంగా…
Happy Birthday Kohli: భారత క్రికెట్ జట్టు వెటరన్ ఆటగాడు విరాట్ కోహ్లీ.. నేడు తన పుట్టినరోజు. ఈ రోజు కోల్‌కతా మైదానంలో ఆడే మ్యాచ్ ఆయనకు ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి.
Pakistan EX Cricketer Hasan Raza Feels BCCI is cheating in ODI World Cup 2023: సొంత గడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతుంది. గురువారం ముంబైలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 302 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన టీమిండియా.. ఈ ఎడిషన్‌లో వరుసగా ఏడో విజయాన్ని నమోదు చేసింది. టోర్నీలో ఇప్పటివరకు అపజయమే లేని భారత్.. సెమీస్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. బ్యాటింగ్,…
జస్ప్రీత్ బుమ్రా వన్డే ప్రపంచ కప్ 2023లో ఓ అరుదైన ఘనత సాధించాడు. 48 ఏళ్ల వరల్డ్ కప్ చరిత్రలో ఏ ఇండియన్ బౌలర్ చేయలేని ఘనతను సాధించాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా తొలి ఓవర్లనే తొలి బంతికే వికెట్ తీశాడు.
శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో ఇద్దరు టీమిండియా బ్యాటర్లు సెంచరీల దగ్గరకు వచ్చి ఔట్ అయ్యారు. గిల్ 93 పరుగుల వద్ద ఔట్ కాగా, కోహ్లీ 88 పరుగుల వద్ద పెవిలియన్ బాట పట్టాడు.
ఎంఎస్ ధోని కెప్టెన్సీలో టీమిండియా ప్రపంచ క్రికెట్లో ఎన్నో పెద్ద మైలురాళ్లను సాధించింది. 2007లో టీ-20 ఫార్మాట్లో భారత జట్టును ఛాంపియన్‌గా నిలిపిన మహి, 2011లో 28 ఏళ్ల కరువుకు స్వస్తి పలికి వన్డే ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకున్నాడు.
టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శనపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ప్రశంసలు కురిపించాడు. భారత్ చాలా అద్భుతంగా ఆడుతుందని, ఇప్పటివరకు టోర్నమెంట్లో ఎటువంటి కఠినమైన పోటీని ఎదుర్కోలేదు. ఇంగ్లాండ్‌పై జట్టు 230 పరుగులు చేసిన తర్వాత, వారు కష్టాల్లో పడ్డట్లు అనిపించింది.. కానీ బౌలర్ల అద్భుత ప్రదర్శనతో విజయం సాధించారని తెలిపాడు. గత కొన్నేళ్లుగా స్వదేశంలో భారత్ ఒక జట్టుగా బలమైన ప్రత్యర్థిగా ఉందని స్మిత్ అన్నాడు. సొంత గడ్డపై భారత్‌ను ఓడించడం ఎప్పుడూ కష్టమే…
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా గాయం కారణంగా ప్రపంచ కప్ మ్యాచ్ లకు దూరమయ్యాడు. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఆయన ఎడమ చీలమండలో గాయమైంది. దీంతో బెంగళూరులోని NCAలో చికిత్స తీసుకుని ప్రస్తుతం నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే.. హార్ధిక్ పాండ్యా త్వరలోనే తిరిగి జట్టులోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.
టీమిండియా గెలుపుపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ .. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘‘లక్నో పిచ్ పై భారత్ అద్భుతమైన బ్యాటింగ్ చేసింది. ముఖ్యంగా వికెట్లు పడుతున్నా కూడా తన ఆటను కొనసాగించింది.