2023 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఘోర పరాజయం పొందిన విషయం తెలిసిందే. టీమిండియాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కోట్లాది మంది అభిమానులు.. ఇప్పటికీ ఆ బాధ నుంచి తేరుకోవడం లేదు. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్లో భారత్ ఓటమిని సెలబ్రేట్ చేసుకున్నారు అక్కడి జనాలు. అందుకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
విశాఖ వేదికగా తొలి టీ20 మ్యాచ్ ఈనెల 23న ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. ఆస్ట్రేలియాతో టీమిండియా 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం పలువురు టీమిండియా ఆటగాళ్లు విశాఖకు చేరుకున్నారు.
వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియాపై భారత్ ఘోర పరాజయం పొందిన సంగతి తెలిసిందే. దీంతో టీమిండియా అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ గ్లెన్ మాక్స్వెల్ భార్య వినీ రామన్పై దుర్భాషలాడారు. దీంతో.. భారత క్రికెట్ అభిమానులపై విని రామన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
అహ్మదాబాద్ లో నిన్న మ్యాచ్ ముగిసిన అనంతరం టీమిండియా డ్రెస్సింగ్ రూంలో సీరియస్ వాతావరణం నెలకొంది. పైకి నవ్వుతూ కనిపించిన ఆటగాళ్ల ముఖాలు.. లోపల మాత్రం గుండెల్లో చెప్పుకోలేనంత బాధ ఉంది. ఈ సమయంలో ప్రధాని మోదీ డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లారు. ఆటగాళ్లను ఓదార్చిందుకే ప్రయత్నించారు. అప్పటికే తీవ్ర విచారణలో ఉన్న మహమ్మద్ షమీని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని హృదయానికి హత్తుకున్నారు.
నిన్న వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా బ్యాటింగ్ చూస్తుంటే.. తగిన మూల్యం చెల్లించుకునేలా కనిపిస్తోందని అభిప్రాయపడ్డాడు. వరుసగా మ్యాచ్ లు గెలుస్తున్నప్పుడు సహజంగానే కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుందని, ఇప్పుడదే టీమిండియా కొంపముంచేలా ఉందని వ్యాఖ్యానించాడు.
ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోయింది. దీంతో మూడోసారి ప్రపంచ ఛాంపియన్గా నిలవాలన్న భారత జట్టు కల చెదిరిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఆస్ట్రేలియా ముందు 241 పరుగుల లక్ష్యం పెట్టింది. దీన్ని ఆసీస్.. 43 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ కు ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా టీమ్ ఇండియా విజయాన్ని కాంక్షించారు. తన X (గతంలో ట్విటర్) ఖాతాలో.. ప్రపంచ కప్ మ్యాచ్లలో 'మెన్ ఇన్ బ్లూ' అసాధారణమైన విజయాల రికార్డులను నెలకొల్పారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 140 కోట్ల మంది ప్రజలు, క్రికెట్ అభిమానులు టీమిండియాకు మద్దతు నిలుస్తున్నారని తెలిపారు.
గత 10 ఓవర్లు నుంచి టీమిండియాకు ఒక్క బౌండరీ రాలేదు. వెంట వెంటనే 3 వికెట్లు కోల్పోవడంతో క్రీజులో ఉన్న కోహ్లీ, కేఎల్ రాహుల్ ఆచితూచి ఆడుతున్నారు. రోహిత్ శర్మ క్రీజులో ఉన్నప్పుడే బౌండరీలు, సిక్సర్లు వచ్చాయి. దాదాపు గంట నుంచి టీమిండియాకు బౌండరీ రాలేదు. ఈ మ్యాచ్ లో టాప్ ఆర్డర్లు విఫలమవ్వడంతో నిలకడగా ఆడుతున్నారు. క్రీజులో విరాట్ కోహ్లీ (49), కేఎల్ రాహుల్ (25) ఉన్నారు.
ఆస్ట్రేలియాతో వరల్డ్ కప్ ఫైనల్కు ముందు మెన్ ఇన్ బ్లూ విజయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. తన X ఖాతాలో.. 140 కోట్ల మంది భారతీయులు టీమిండియా కోసం ఉంటారని తెలిపారు. అంతేకాకుండా.. కెప్టెన్ రోహిత్ శర్మ క్రీడాస్ఫూర్తిని నిలబెడతారని, బాగా ఆడండి అంటూ ట్వీట్ చేశారు.