Team India T20 World Cup Record: టీ20 ప్రపంచకప్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. మెగా టోర్నీలో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక విజయాలు నమోదు చేసిన మొదటి జట్టుగా రికార్డు నెలకొల్పింది. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన 6 పరుగుల తేడాతో గెలుపొందింది. టీ20 ప్రపంచకప్‌లో పాక్‌పై భారత్‌కు ఇది 7వ విజయం. దాంతో భారత్ ఖాతాలో ఈ అరుదైన రికార్డు చేరింది. పొట్టి టోర్నీలో ఇండో-పాక్ టీమ్స్ ఇప్పటివరకు 8 సార్లు తలపడగా.. భారత్ ఏకంగా ఏడు విజయాలు అందుకుంది.
టీ20 ప్రపంచకప్ 2007లో గ్రూప్ స్టేజ్‌లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ టై అవ్వగా.. బాల్ ఔట్ పద్దతిలో టీమిండియా గెలిచింది. ప్రపంచకప్ 2007 ఫైనల్లో ఇరు జట్లు తలపడగా.. భారత్ విజయం సాధించింది. టీ20 ప్రపంచకప్ 2009లో ఇరు జట్లు వేర్వేరు గ్రూప్‌ల్లో ఉండటంతో తలపడలేదు. 2012, 2014, 2016 ప్రపంచకప్‌లో భారత్ గెచింది. టీ20 ప్రపంచకప్ 2021లో భారత్‌ను పాకిస్థాన్ ఓడించింది. 2022, 2024లో పాకిస్థాన్‌ను టీమిండియా ఓడించింది.
Also Read: Jasprit Bumrah: నా కెరీర్ ముగిసిందన్నారు: బుమ్రా
టీమిండియాపై ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో పాకిస్థాన్ నిరాశే ఎదురైంది. ఏడు విజయాలు సాధించిన భారత్.. పాకిస్థాన్ పేరిట ఉన్న రికార్డును అధిగమించింది. బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్ ఆరు విజయాలు సాధించింది. వెస్టిండీస్‌పై శ్రీలంక కూడా 6 సార్లు గెలుపొందింది. ఇక టీమిండియాపై ఓటమితో పాకిస్థాన్ సూపర్ 8 చేరుకునే అవకాశాలు సన్నగిల్లాయి. గ్రూప్-ఏలో టీమిండియాతో పాటు అమెరికా రెండు విజయాలు సాధించి పట్టికలో అగ్రస్థానంలో ఉంది.