భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్‌కు ముందు.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మీడియా కాన్ఫరెన్స్ లో కీలక విషయాలు వెల్లడించాడు. ఆస్ట్రేలియా చివరి ఎనిమిది మ్యాచ్‌లలో విజయం సాధించినందుకు తనకు ఎటువంటి ఇబ్బంది లేదని రోహిత్ శర్మ చెప్పాడు. అంతేకాకుండా.. ఈ ప్రపంచకప్ కోసం రెండేళ్ల కిందటే సన్నాహాలు ప్రారంభించినట్లు తెలిపాడు.
ఫైనల్ మ్యాచ్ కు ముందు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కీలక సందేశం ఇచ్చాడు. “మేము ఇప్పటివరకు చేసిన ప్రతిదీ మా వెనుక సంవత్సరాల కృషికి క్రెడిట్. మేము ఇప్పుడు కీర్తికి ఒక అడుగు దూరంలో ఉన్నాము, మేము చిన్నప్పటి నుండి కలలుగన్న కలను నిజం చేయండి ”అని పాండ్యా అన్నాడు. కప్‌ను తమ కోసం మాత్రమే కాకుండా.. బిలియన్ భారతీయ ప్రజల కోసం కప్ ను తీసుకురావాలని జట్టును కోరాడు.
అహ్మదాబాద్‌లో జరిగే వరల్డ్ కప్ ఫైనల్ కోసం ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ వరల్డ్ కప్ లో టీమిండియా అన్నీ మ్యాచ్ ల్లో గెలిచి మంచి జోష్ లో ఉంది. అయితే వరల్డ్ కప్ సాధించి చరిత్ర సృష్టించేందుకు భారత్ కేవలం ఒక్క అడుగుదూరంలో ఉంది. ఇదిలా ఉంటే.. ఆసీస్ జట్టుకు ప్రపంచకప్ ఫైనల్ లో ట్రోఫీ సాధించడం వెన్నతో పెట్టిన విద్య లాంటిది. ఇప్పటికే ఐదు సార్లు జగజ్జేతగా నిలిచిన ఆస్ట్రేలియా.. మరో…
వరల్డ్ కప్ 2023లో టీమిండియా విజయాల జోరును చూపించింది. ఆడిన అన్నీ మ్యాచ్ ల్లోనూ గెలిచి ఫైనల్ చేరింది. అయితే ఇప్పుడు ఈ ఒక్క మ్యాచ్ గెలిస్తే టోర్నీ టైటిల్ దక్కించుకుంటుంది. ఈ క్రమంలో అహ్మదాబాద్ చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు.. నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రాక్టీస్ మొదలు పెట్టారు. కెప్టెన్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, అశ్విన్ తదితర ఆటగాళ్లు స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నారు.
ఐసీసీ ప్రపంచ కప్ 2023.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో అక్టోబర్ 5న ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్ ప్రారంభమైనప్పటి నుండి చాలా మంది ఆటగాళ్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను పొందారు. రోహిత్ శర్మ ఇప్పటివరకు రెండు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నాడు.
ప్రపంచకప్ 2023 ట్రోఫీని అందుకోవడానికి టీమ్ ఇండియా కేవలం ఒక్క అడుగు దూరంలోనే ఉంది. సెమీఫైనల్లో టీమిండియా 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి ఫైనల్లోకి ప్రవేశించింది. నవంబర్ 19న నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్‌కు రోహిత్ సేన సిద్ధంగా ఉంది.
ఈ ప్రపంచకప్ లో టీమిండియా మంచి ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటికే లీగ్ దశలో ఆడిన 9 మ్యాచ్ ల్లో ఓటమి ఎరుగని జట్టుగా ముందుకు దూసుకెళ్తుంది. ఈ క్రమంలో రేపు న్యూజిలాండ్ తో సెమీస్ లో తలపడనుంది. ఇంతకుముందు న్యూజిలాండ్-ఇండియా మధ్య మ్యాచ్ జరిగినప్పుడు టీమిండియాను కివీస్ బౌలర్లు ఇబ్బంది పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరోవైపు టీమిండియా బౌలర్లు న్యూజిలాండ్‌ను దెబ్బతీసిన సందర్భాలు చాలా ఉన్నాయి.
టీమిండియా టాస్ గెలిస్తే ముందుగా ఏం చేయాలి అనే ప్రశ్న టీమిండియా అభిమానులందరిలో మెదులుతోంది. అయితే.. ఈ ప్రశ్నపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఓ సలహా ఇచ్చాడు. ఈ బిగ్ మ్యాచ్‌లో పరుగులను ఛేజ్ చేయడం ఎప్పుడూ కష్టమేనని తన వీడియోలో చెప్పాడు. అంతేకాకుండా.. మొదట బ్యాటింగ్ చేస్తే భారత్ ఆలౌట్ అవుతుందని చెప్పాడు. వాంఖడేలో మంచు కురిసిన తర్వాత పరుగులను ఛేజింగ్ చేయడం ఎప్పుడూ కష్టమే, కానీ టీమిండియా ఇంతకుముందు ఆ పని…
వరల్డ్‌కప్ 2023లో భారత్ విజయాలతో దూసుకెళ్తుంది. లీగ్ మ్యాచుల్లో ఆడిన 9 మ్యాచ్‌ల్లో ఓటమెరుగని జట్టుగా నిలిచి సెమీస్‌లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో జట్టు వరుస విజయాలపై కోచ్ రాహుల్ ద్రవిడ్ కారణం వివరించాడు. జట్టు తనకు తానుగా ప్రత్యేకంగా ఓ టాస్క్ పెట్టుకుందని తెలిపాడు.
దేశం మొత్తం దీపావళి సంబరాలు ఘనంగా జరుపుకుంటుంది. అందులో భాగంగానే దీపావళి సంబరాలను టీమిండియా ఆటగాళ్లు కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈరోజు జరిగే నెదర్లాండ్స్ తో మ్యాచ్ కు ముందే బెంగళూరులోని ఐటీసీ గార్డెనియా హోటల్ లో జరుపుకున్నారు. ఈ వేడుకలో టీమిండియా సభ్యులతో పాటు, వారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొని ఆనందంగా గడిపారు. సాంప్రదాయ దుస్తులు ధరించి వారి ఫ్యామిలీలతో హాజరయ్యారు. టీమిండియా దివాళీ సెలబ్రేషన్ వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో…