వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌కు మరోసారి ఓడిపోవడంతో భారత జట్టుపై సర్వాత్ర ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో రోహిత్ శర్మ సారధ్యంలోని టీమిండియాను భారత ప్రధాని నరేంద్ర మోడీ అభినంధించారు. భారత ఘన విజయం పట్ల ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు.
Ind vs Pak: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను క్రికెట్లో అతిపెద్ద మ్యాచ్ అని పిలుస్తారు. లక్షలాది మంది దీనిని చూస్తున్నారు. విజయాల్లో భారీ సంబరాలు, పరాజయాల్లో ఆటగాళ్లపై విమర్శలు కామన్.
వరల్డ్ కప్ 2023 ప్రారంభంకు ముందే టీమిండియా డాషింగ్ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ డెంగ్యూ బారిన పడ్డాడు. దీంతో జట్టు ఆడిన రెండు మ్యాచ్‌లకు అతను దూరమ్యాడు. అయితే అప్పటి నుంచి చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందగా.. తాజాగా కోలుకున్నాడు. దీంతో పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ లో ఆడనున్నట్లు తెలుస్తోంది. అందుకోసం గిల్ నెట్స్ లో అడుగుపెట్టి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.
2023 వరల్డ్ కప్ ప్రారంభం నుంచే టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ మ్యాచ్ లకు దూరమయ్యాడన్న సంగతి తెలిసిందే. డెంగ్యూ బారిన పడి.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. తాజాగా మరొకరు డెంగ్యూ బారిన పడ్డాడు. భారతీయ ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే డెంగ్యూ బారిన పడ్డారు. అయితే అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌కు హర్ష దూరం కానున్నాడు.
2023 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో తలపడింది. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించినప్పటికీ.. టాప్ ఆర్డర్ మాత్రం పూర్తిగా విఫలమైంది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ సహా ముగ్గురు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు డకౌట్ అయ్యారు.
వన్డే వరల్డ్ కప్ లో ఆతిథ్య భారత్ రేపు(ఆదివారం) ఆస్ట్రేలియాతో తలపడనుంది. తొలిసారి వరల్డ్ కప్ భారత్ నిర్వహిస్తుండటంతో.. ఎలాగైనా కప్ ను సొంతం చేసుకోవాలనే ఆశతో ఉన్నారు టీమిండియా. మరోవైపు రేపటి మ్యాచ్ లో కొందరు ఆటగాళ్లు ఆటడంలేదు. దీంతో ప్లేయింగ్ ఎలెవన్ లో ముగ్గురు స్పిన్నర్లను చేర్చుకునే అవకాశం ఉందని కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు.
ఆసియా క్రీడల్లో మెన్స్ టీమిండియా స్వర్ణం సాధించింది. భారత్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. వర్షం ఆటకు అంతరాయం కలిగించడంతో మ్యాచ్ పూర్తి కాలేదు. దీంతో ఎక్కువ ర్యాంకింగ్ కారణంగా భారత్‌ను విజేతగా ప్రకటించారు. ఈ క్రమంలో భారత జట్టు ఖాతాలో మరో స్వర్ణం చేరింది.
Asian Games 2023: ఆసియా క్రీడలు 2023లో భారత్ చరిత్ర సృష్టించింది. చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు 100 పతకాలు సాధించింది.
రేపు( మంగళవారం) ఆసియా క్రీడలు 2023లో భాగంగా.. భారత్-నేపాల్ మధ్య క్వార్టర్-ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. హాంగ్జౌలోని పింగ్‌ఫెంగ్ క్యాంపస్ క్రికెట్ గ్రౌండ్లో మ్యాచ్ జరుగనుంది. ఈ టోర్నీలో తొలిసారిగా రుతురాజ్ గైక్వాడ్ భారత్ కు సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. అయితే ఆసియా క్రీడల్లో ఆడేందుకు భారత జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లకు చోటు దక్కింది.
Virat Kohli Back to Mumbai to Meet Anushka Sharma: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా గువాహటిలో భారత్ ఆడాల్సిన మొదటి వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో వార్మప్ మ్యాచ్ కోసం ప్లేయర్స్ తిరువనంతపురం చేరుకున్నారు. అయితే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ జట్టుతో కలిసి తిరువనంతపురం వెళ్లలేదని తెలుస్తోంది. అతడు ఉన్నపలంగా ముంబై వెళ్లినట్లు పలు స్పోర్ట్స్, జాతీయ మీడియా సంస్థలు తమ కథనాల్లో పేర్కొన్నాయి. ఇందుకు కారణం…