Rohit Sharma Injury: టీ20 ప్రపంచకప్- 2024లో ఆసక్తికర పోరుకు మరో 24 గంటల సమయం మాత్రమే ఉంది. ఈ మెగా టోర్నమెంట్ లో భాగంగా రేపు (జూన్ 9) న్యూయర్క్ వేదికగా భారత్- పాకిస్తాన్ జట్లు మధ్య జరగనుంది. ఈ హై వోల్టెజ్ మ్యాచ్ కు ముందు టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇండియా సారథి రోహిత్ శర్మ మళ్లీ గాయపడ్డాడు. పాకిస్తాన్ తో మ్యాచ్‌కు ముందు నెట్ ప్రాక్టీస్ చేస్తుండగా రోహిత్ బొటన వేలికి గాయమైంది. త్రోడౌన్ స్పెషలిస్ట్ నువాన్ వేసిన బంతి అనూహ్యంగా బౌన్స్ కావడంతో అది కాస్తా.. రోహిత్ చేతి వేలికి తగిలింది. వెంటనే వైద్య సిబ్బంది స్టేడియంలోకి పరిగెత్తుకుంటూ వచ్చి హిట్‌మ్యాన్‌కు ప్రథమ చికిత్స అందించారు.
Read Also: CWC Meeting : ఓడినా 24 గంటలు 365 రోజులూ ప్రజల మధ్యే ఉండాల్సిందే : మల్లికార్జున ఖర్గే
కానీ, నొప్పి తగ్గకపోవడంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రాక్టీస్ సెషన్స్ మధ్యలోనే నుంచి వెనుదిరిగిపోయాడు. అయితే, రోహిత్ గాయంపై జట్టు యాజమాన్యం గానీ, బీసీసీఐ గానీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనను వెల్లడించలేదు. ఒకవేళ రేపు పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ కు రోహిత్ దూరమైతే టీమిండియాకు గట్టి షాక్ అని చెప్పుకోవాలి. కాగా అంతకు ముందు ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పేసర్ మార్క్ అడైర్ వేసిన ఓ బౌన్సర్ హిట్‌మ్యాన్ మోచేతికి తాకడంతో అతడు నొప్పితో అల్లాడిపోయాడు. ఇక, ఆ తర్వాత ఫిట్‌నెస్ సాధించిన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అనుహ్యంగా మరోసారి గాయపడ్డాడు. కాగా, రోహిత్ రేపు జరిగే మ్యాచ్ ఆడేది అనుమానంగా మారింది.