స్వదేశంలో భారత్ జట్టు ఏడాది కాలంలో రెండు టెస్టు సిరీస్‌ల్లో వైట్‌వాష్‌కు గురైంది. గౌతమ్ గంభీర్ కోచ్ అయ్యాక స్వదేశంలో న్యూజీలాండ్ (0-3), దక్షిణాఫ్రికా (0-2) చేతిలో టీమిండియా వైట్‌వాష్‌లను ఎదుర్కొంది. దాంతో గౌతీపై తీవ్ర స్థాయిలో విమర్శలొస్తున్నాయి. అటు మాజీలు, ఇటు అభిమానులు ఏకిపారేస్తున్నారు. గంభీర్ కోచింగ్ శైలిపై అందరూ మండిపడుతున్నారు. ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులకు సంబంధించి ఆయనపై విమర్శలు వచ్చాయి. ఇప్పుడు, గంభీర్, జట్టు సీనియర్ ఆటగాళ్ల మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలు…
Internal Conflict In Team India: భారత్- ఆస్ట్రేలియా తొలి వన్డేలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి రావడంతో టీమిండియాలో ఉత్సాహం పెరిగినట్లు కనిపించినప్పటికీ, డ్రెస్సింగ్ రూంలో మాత్రం పరిస్థితి మరో విధంగా ఉందని సమాచారం.
IND vs SA 1st ODI: స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో టీమిండియా కోల్పోయింది. ఇప్పుడు అదే జట్టుతో 3 వన్డేల సిరీస్‌కు భారత్ సిద్ధం అవుతోంది. రేపు (నవంబర్ 30న) రాంచీలోని JSCA ఇంటర్నేషనల్ స్టేడియంలో మొదటి వన్డే జరగనుంది.
నవంబర్ 30వ తేదీ నుంచి (ఆదివారం) సౌతాఫ్రికాతో 3 వన్డేల సిరీస్ స్టార్ట్ కానుంది. జార్ఖండ్ లోని రాంచీ వేదికగా మొదటి వన్డే మ్యాచ్ జరగనుంది. ఇక, ఈ మ్యాచ్ కి టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ రీ ఎంట్రీతో జట్టు బలంగా కనిపిస్తోంది.
టీ20 ప్రపంచకప్ 2026 షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ మెగా టోర్నీ వచ్చే ఫిబ్రవరి 7న ప్రారంభమై.. మార్చి 8న ముగుస్తుంది. 2024లో ఛాంపియన్‌గా నిలిచిన టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. టోర్నమెంట్లో మొత్తం 20 జట్లు పాల్గొననుండగా.. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ జట్లు ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. ఈ మ్యాచ్ కొలంబో వేదికగా ఫిబ్రవరి 15న జరగనుంది. టీ20 ప్రపంచకప్ 2026 షెడ్యూల్ కార్యక్రమంలో…
సొంతగడ్డపై భారత్ ఘోర పరాజయంను చవిచూసింది. దక్షిణాఫ్రికాతో గువాహటిలో జరిగిన రెండో టెస్టులో ఏకంగా 408 పరుగుల తేడాతో ఓడిపోయింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 140 పరుగులకే ఆలౌట్ అయింది. రవీంద్ర జడేజా (54) టాప్ స్కోరర్. టాప్ బ్యాటర్లు అందరూ విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో సైమన్ హార్మర్ 6 వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. కేశవ్ మహారాజ్ 2 వికెట్లు పడగొట్టగా.. ముత్తుస్వామి, మార్కో యాన్సన్ చెరో వికెట్ తీశారు. ఈ ఓటమితో టీమిండియా టెస్ట్…
‘ఆట’ అన్నాక గాయాలు అవ్వడం సహజమే. క్రికెట్ కూడా అందుకు ఏమాత్రం మినహాయింపు కాదు. అంతర్జాతీయ క్రికెట్లో గాయాల పాలు కాని ఆటగాళ్లు చాలా అరుదు అనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి ప్లేయర్ ఎప్పుడోకప్పుడు ఇంజురీకి గురవుతాడు. అయితే టీమిండియాకు కొన్నేళ్ల నుంచి గాయాలు పెద్ద సమస్యగా మారుతున్నాయి. స్టార్ ప్లేయర్స్ నెలల తరబడి మైదానంకు దూరమవుతున్నారు. ఈ లిస్ట్ చాలా పెద్దదే. ఇటీవలి గాయాలు చూస్తే.. ప్రస్తుత క్రికెటర్లు మరీ సున్నితంగా తయారవుతున్నారా? అనే సందేహాలు…
దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌లో భారత జట్టుకు కేఎల్ రాహుల్ నాయకత్వం వహించనున్నాడు. నవంబర్ 30 నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో రాహుల్ టీమిండియాను నడిపించనున్నాడు. మెడ నొప్పితో బాధపడుతున్న రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ స్థానంలో రాహుల్‌ను బీసీసీఐ నియమించింది. రాహుల్ గతంలో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. మూడు ఫార్మాట్లలో సారథిగా చేశాడు. మరోసారి కెప్టెన్సీని చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. కేఎల్ రాహుల్‌కు పెద్దగా కెప్టెన్సీ అనుభవం లేదు కానీ..…
గత నవంబరులో సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో భారత్ భంగపడిన విషయం తెలిసిందే. మూడు టెస్టుల సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురై.. తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. స్పిన్ ఆడడంలో మేటి జట్టుగా పేరున్న టీమిండియా.. సొంతగడ్డపై అదే స్పిన్ ఉచ్చులో పడడం భారత క్రికెట్‌ను కుదిపేసింది. స్వదేశంలో మరోసారి ఇలాంటి పరాభవం చూడబోమని అటు మాజీలు, ఇటు ఫాన్స్ అనుకున్నారు. కానీ ఇప్పుడు టీమిండియాకు మరో వైట్‌వాష్ తప్పేలా లేదు. ఇప్పటికే కోల్‌కతా జరిగిన మొదటి టెస్టులో ఓడిన భారత్..…