Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ సంచలన నిర్ణయం!
- వైభవ్ సూర్యవంశీ సంచలన నిర్ణయం
- చదువును పక్కన పెట్టిన యువ సంచలనం వైభవ్
- పదో తరగతి పరీక్షలు స్కిప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi Skips 10th Exams for IPL 2026: టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. క్రికెట్ కోసం చదువును పక్కన పెట్టాడు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు స్కిప్ చేయాలని వైభవ్ స్వయంగా నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ వెల్లడించారు. తన కుమారుడు పదో తరగతి పరీక్షలు వచ్చే ఏడాది రాస్తాడని స్పష్టం చేశారు. ఈ ఏడాది పరీక్షలకు హాజరైనా.. పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోయేవాడని సంజీవ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం చదువు పక్కన పెట్టి పూర్తిగా క్రికెట్‌పైనే దృష్టి పెట్టినట్లు ఆయన వెల్లడించారు.
సంజీవ్ సూర్యవంశీ మాట్లాడుతూ… ‘ప్రస్తుతం వైభవ్ నాగ్‌పూర్‌లో రాజస్తాన్ రాయల్స్ జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ ఏడాది వైభవ్ పరీక్షల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈసారి పదో తరగతి పరీక్షలు స్కిప్ చేయాలని వైభవ్ స్వయంగా నిర్ణయించుకున్నాడు. వచ్చే ఏడాది పరీక్షలు రాస్తాడు. ఈ ఏడాది పరీక్షలకు హాజరైనా.. వైభవ్ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోయేవాడు. ఒత్తిడిలో ఏ పని చేయొద్దు. చదువులో వైభవ్ ఎప్పుడూ ముందే ఉంటాడు. స్కూల్‌కి రెగ్యులర్‌గా వెళ్లినప్పుడు చదువులో మంచి ప్రతిభ కనబరిచేవాడు. అన్ని సబ్జెక్టుల్లో 90 శాతం పైగా మార్కులు సాధించేవాడు. అయితే ఇప్పుడు అతడి ప్రధాన లక్ష్యం క్రికెట్ కావడంతో చదువుపై దృష్టి పెట్టడం కష్టమవుతోంది’ అని చెప్పారు.
Also Read
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
- Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
- India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
Also Read: Dasun Shanaka: కలలో కూడా ఊహించలేదు, ఇది అవమానకరం.. జింబాబ్వేపై ఓటమిపై షనక సంచలన వ్యాఖ్యలు
ప్రస్తుతం సంజీవ్ సూర్యవంశీ కెరీర్‌కు కీలకమైన దశలో ఉన్నందున పూర్తిగా ఆటపై దృష్టి పెట్టడం అవసరమని అందరం మద్దతు ఉన్నాం అని సంజీవ్ సూర్యవంశీ తెలిపారు. యువ వయసులోనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ధైర్యమైన అడుగే అయినప్పటికీ, తన కలను నెరవేర్చేందుకు వైభవ్ కట్టుబడి ఉన్నాడని గర్వంగా చెప్పారు. క్రికెట్‌లో పెద్ద స్థాయికి చేరాలని లక్ష్యంగా పెట్టుకున్న వైభవ్ ప్రయాణం ఎలా కొనసాగుతుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపుగా ఆతడు భారత జట్టు ఎంట్రీకి దగ్గరగా వచ్చేశాడు. ఐపీఎల్ 2026లో రాణిస్తే.. ఈ ఏడాది అతడికి టీమిండియాలో చోటు దక్కే అవకాశాలు లేకపోలేదు. అండర్-19 వరల్డ్‌కప్ 2026లోనూ వైభవ్ అదరగొట్టాడు. ఇంగ్లండ్‌పై ఫైనల్లో 80 బంతుల్లో 175 రన్స్ బాది.. భారత్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
తాజావార్తలు
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!