ravi shastri comments on test cricket: ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో టీ20 ఫ్రాంచైజీ ఆధారిత లీగ్‌లు పెరిగిపోతున్నాయి. దీంతో టెస్ట్ క్రికెట్‌పై అభిమానుల్లో ఆసక్తి తగ్గిపోతోందని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో టెస్ట్ క్రికెట్ నాణ్యత పెంచడానికి జట్ల సంఖ్యను ఐసీసీ తగ్గించాలని రవిశాస్త్రి డిమాండ్ చేశాడు. టెస్ట్ క్రికెట్లో ఆరు జట్లు మాత్రమే ఉండాలన్నాడు. టెస్టు క్రికెట్ నాణ్యత కోల్పోతే క్రికెట్‌పై అభిమానులకు ఆసక్తి తగ్గిపోతుందని…
కరేబియన్ పర్యటనను విజయంతో ప్రారంభించింది... టీమిండియా. క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానంలో ఉత్కంఠభరితంగా జరిగిన తొలి వన్డేలో... 3 పరుగుల తేడాతో విండీస్‌పై గెలిచింది.
Team India scored 308 runs against west indies in first odi పోర్టు ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఓపెనర్లు రాణించడంతో టీమిండియా భారీ స్కోరు చేసింది. ధావన్ (97), శుభ్‌మన్ గిల్ (64) హాఫ్ సెంచరీలతో రాణించడంతో 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. ధావన్ మూడు పరుగుల తేడాలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. ధావన్-గిల్ తొలి వికెట్‌కు 119 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.…
India Vs West Indies First Odi వెస్టిండీస్ పర్యటనలో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే ఈరోజు జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ గైర్హాజరీలో జట్టును శిఖర్ ధావన్ నడిపించనున్నాడు. తన కెరీర్లో రెండోసారి టీమిండియాకు ధావన్ నాయకత్వం వహిస్తున్నాడు. గత ఏడాది శ్రీలంక పర్యటనలో తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన అతడు ఇప్పుడు మరోసారి ఆ బాధ్యతలను చేపట్టాడు. ఈ మ్యాచ్‌కు రవీంద్ర జడేజా…
Virat Kohli Instagram Income: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఇటీవల పేలవంగా ఆడుతున్నాడు. మైదానంలో అతడు పరుగులు చేయకపోయినా సోషల్ మీడియా ద్వారా కాసులు బాగానే సంపాదిస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్ కోహ్లీకి 100 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఈ స్థాయిలో ఫాలోవర్లు ఏ క్రికెటర్‌కు కూడా లేరు. దీంతో ఇన్స్టాగ్రామ్ వేదికగా కోహ్లీ రికార్డు స్థాయిలో డబ్బులు సంపాదిస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పలు బ్రాండ్లకు సంబంధించి కోహ్లీ ఒక్క పోస్ట్ చేస్తే రూ.8.69కోట్లు ఆర్జిస్తున్నట్లు ఓ…
Team India Reached West indies: టీమిండియా వరుసబెట్టి సిరీస్‌ల మీద సిరీస్‌లు ఆడుతోంది. ఇటీవల ఇంగ్లండ్‌తో టెస్ట్, వన్డే, టీ20 సిరీస్‌లు ఆడిన టీమిండియా వచ్చే శుక్రవారం నుంచి వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది. ఈ మేరకు బుధవారం సాయంత్రం భారత జట్టు వెస్టిండీస్ చేరుకుంది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగే తొలి వన్డే కోసం జట్టు ట్రినిడాడ్ చేరిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. సీనియర్ క్రికెటర్లంతా ఈ సిరీస్‌కు…
ICC Latest ODI Rankings: ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకుల్లో టాప్-10 జాబితాలో టీమిండియా నుంచి ఇద్దరే ఆటగాళ్లకు చోటు దక్కింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక పాయింట్ కోల్పోయి నాలుగో స్థానానికి పడిపోయాడు. అతడి ఖాతాలో 790 పాయింట్లు ఉన్నాయి. అటు ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ ఖాతాలో 786 పాయింట్లు ఉన్నాయి. వన్డే ర్యాంకుల్లో పాకిస్థాన్ ఆటగాడు బాబర్ ఆజమ్ 892 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.…
Sunil Gavaskar on Virat Kohli’s Form: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఫామ్‌తో సతమతం అవుతున్నాడు. గత రెండున్నరేళ్లుగా అతడి నుంచి సెంచరీ జాలువారలేదు. దీంతో కోహ్లీపై అన్ని వైపుల నుంచి విమర్శలు చెలరేగుతున్నాయి. ఇప్పటికే కపిల్ దేవ్ లాంటి దిగ్గజ ఆటగాడు జట్టు నుంచి కోహ్లీని తప్పించాలని డిమాండ్ చేశాడు. తాజాగా కోహ్లీ ఫామ్ అంశంపై మాజీ ఆటగాడు, ప్రముఖ కామెంటేటర్ సునీల్ గవాస్కర్ స్పందించాడు. 20 నిమిషాల పాటు కోహ్లీతో…
ICC ODI Rankings: ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న టీమిండియా ఐసీసీ వన్డే ర్యాంకుల్లోనూ జోరు చూపించింది. వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్‌ను నాలుగో స్థానానికి నెట్టిన టీమిండియా 109 పాయింట్లతో మూడో స్థానానికి చేరింది. పాకిస్థాన్ ఖాతాలో 106 పాయింట్లు ఉన్నాయి. వన్డే ర్యాంకుల్లో న్యూజిలాండ్ 128 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. టీమిండియాతో వన్డే సిరీస్ కోల్పోయినా 121 పాయింట్లతో ఇంగ్లండ్ రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. అటు 101 పాయింట్లతో ఆస్ట్రేలియా…
India Vs England: మాంచెస్టర్ వేదికగా ఈరోజు టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో వన్డే జరగనుంది. టీ20 సిరీస్ విజయం ఇచ్చిన ఉత్సాహంతో వన్డే సిరీస్ ప్రారంభించిన భారత్ తొలి వన్డేలో ఘనవిజయం సాధించింది. అయితే రెండో వన్డేలో షాక్ తగిలింది. 240 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేక చతికిలపడింది. దాంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమమైంది. ఆదివారం జరిగే చివరి మ్యాచ్‌లో విజయం సాధించే జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది. దీంతో ఇరు…