లార్డ్స్ వేదికగా గురువారం రెండో వన్డేలో ఆతిథ్య ఇంగ్లండ్‌తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. తొలి వన్డేలో ఘోర పరాజయం చవిచూసిన ఇంగ్లండ్ మూడు వన్డేల సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంంటే రెండో వన్డేలో విజయం సాధించి తీరాల్సిందే. టీమిండియా మాత్రం రెండో వన్డేలో కూడా రాణించాలని కోరుకుంటోంది. గజ్జల్లో గాయంతో తొలి వన్డేకు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ రెండో వన్డేకు కూడా దూరం కానున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అతడు ఇంకా గాయం నుంచి కోలుకోలేదని…
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మద్దతు పలికాడు. విరాట్ ఫామ్ గురించి మాట్లాడేవారు రోహిత్ పేరు ఎందుకు ఎత్తట్లేదని ఆయన ప్రశ్నించాడు. రోహిత్ శర్మ పరుగులు చేయనప్పుడు ఎవరూ దాని గురించి మాట్లాడలేదని… ఇతర ఆటగాళ్లు ఫామ్‌లో లేనప్పుడు ఎవరూ ప్రశ్నించలేదని.. ఒక్క విరాట్ విషయంలోనే ఎందుకిలా జరుగుతుందో తనకు అర్థం కావట్లేదని సునీల్ గవాస్కర్ అసహనం వ్యక్తం చేశాడు. విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్ అందుకోవాలంటే ఇంగ్లండ్‌తో మూడు…
కామన్వెల్త్ క్రీడల్లో అధికారులు మహిళల క్రికెట్‌కు చోటు కల్పించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది బర్మింగ్ హామ్ వేదికగా కామన్వెల్త్ క్రీడలు జరగనున్నాయి. ఈ క్రీడల్లో టీ20 ఫార్మాట్లో క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ మేరకు కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనేందుకు మహిళల టీమిండియా జట్టు ఇప్పటికే బర్మింగ్‌హోమ్ చేరుకుంది. తాజాగా ఈ టోర్నీలో పాల్గొనే 15 మంది ప్లేయర్స్ లిస్టును సెలక్టర్లు ప్రకటించారు. ఈ జట్టుకు హర్మన్‌ప్రీత్ కెప్టెన్‌గా, స్మృతి మంధాన వైస్‌కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి…
గాలే వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక విజయం సాధించింది. ఏకంగా ఇన్నింగ్స్ 39 పరుగుల తేడాతో గెలిచి రెండు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. దీంతో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23లో శ్రీలంక జట్టు నాలుగో విజయాన్ని నమోదు చేసింది. డబ్ల్యూటీసీ సెకండ్ ఫేజ్‌లో ఆస్ట్రేలియాకు ఇదే తొలి ఓటమి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా స్థానానికి దెబ్బ పడటంతో పాటు టీమిండియా స్థానానికి కూడా శ్రీలంక ఎసరు తెచ్చింది. తాజా ఓటమితో…
నేడు ఓవల్ వేదికగా టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలివన్డే జరగనుంది. ఇటీవల మూడు టీ20ల సిరీస్‌ను కైవసం చేసుకున్న రోహిత్ సేన ఇప్పుడు వన్డే సిరీస్‌ను కూడా చేజిక్కించుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే సోమవారం జరిగిన ఆప్షనల్ ప్రాక్టీసుకు విరాట్ కోహ్లీ హాజరుకాలేదు. దీంతో కోహ్లీ ఇవాళ్టి మ్యాచ్‌లో ఆడతాడా, లేదా అనేదానిపై అస్పష్టత నెలకొంది. కోహ్లీ గజ్జల్లో గాయంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. మూడో టీ20 సందర్భంగా విరాట్‌కు గజ్జల్లో గాయమైంది. ఈ నేపథ్యంలో అతడు…
ఫామ్ కోసం తంటాలు పడుతున్న విరాట్ కోహ్లీని జట్టు నుంచి తప్పించాలంటూ మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తాజాగా కపిల్ దేవ్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కౌంటర్ ఇచ్చాడు. డ్రెస్సింగ్ రూంలో ఏం జరుగుతుందో కపిల్ దేవ్‌కు తెలియదన్నాడు. ఆటగాళ్ల ప్రదర్శన ఎలా ఉన్నా డ్రెస్సింగ్ రూంలో ఒకరికి ఒకరం మద్దతు ఇచ్చుకుంటామని.. ఒక ఆటగాడి సామర్థ్యం తెలుసుకుని అతడికి అండగా నిలుస్తామని రోహిత్ స్పష్టం చేశాడు. ఫామ్…
నాటింగ్‌హామ్ వేదికగా టీమిండియాతో జరిగిన నామమాత్రపు మూడో టీ20లో ఇంగ్లండ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 216 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు మాత్రమే చేసింది. ఓ దశలో ఓడిపోతుందని అభిమానులు భావించారు. అయితే భారత శిబిరంలో సూర్యకుమార్ ఆశలు రేకెత్తించాడు. అతడు ఇంగ్లండ్ బౌలర్లను చీల్చి చెండాడి మెరుపు సెంచరీ చేశాడు. 55 బంతుల్లో 14 ఫోర్లు, ఆరు సిక్సర్ల సహాయంతో 117 పరుగులు చేసి…
నాటింగ్ హామ్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టీ20లో ఇంగ్లండ్ భారీ స్కోరు చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. ఓపెనర్లు బట్లర్ (18), జాసన్ రాయ్ (27) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. వీళ్లిద్దరూ అవుటైనా డేవిడ్ మలన్ (77), లివింగ్‌స్టోన్ (42 నాటౌట్) ఫోర్లు, సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించారు. దీంతో ఇంగ్లండ్ భారీ స్కోరు చేయగలిగింది. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్,…
అంతర్జాతీయ టీ20ల్లో భారత్ ఖాతాలో మరో సిరీస్ చేరింది. శనివారం నాడు ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో 49 పరుగుల తేడాతో ఆతిధ్య జట్టును టీమిండియా మట్టికరిపించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి ఇంగ్లండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. అనంతరం 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన…
టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లీపై మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కొంతకాలంగా పరుగులు చేసేందుకు ఇబ్బందులు పడుతున్న కోహ్లీని టీ20ల నుంచి తప్పించాలని సెలక్టర్లకు కపిల్ దేవ్ సూచించాడు. అశ్విన్ వంటి మేటి బౌలర్‌నే తప్పించినప్పుడు కోహ్లీని ఎందుకు పక్కనబెట్టరని ప్రశ్నించాడు. అశ్విన్ టెస్టుల్లో వరల్డ్ నంబర్ 2 ఆటగాడు అని… అలాంటి ఆటగాడినే పక్కనపెట్టారని.. కోహ్లీకి కూడా ఇదే పరిస్థితి వస్తుందని కపిల్ జోస్యం చెప్పాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ…