Sanju Samson: జట్టులో చోటు దక్కాలంటే.. వాటిని ఎదుర్కొంటూనే ఉండాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanju Samson Reacts On Placement In Team India: ఇటీవల బీసీసీఐ ప్రకటించిన టీ20 వరల్డ్‌కప్ భారత జట్టులో యువ ఆటగాడు సంజూ శాంసన్‌కి చోటు దక్కకపోవడంపై ఏ స్థాయిలో విమర్శలు వచ్చాయో అందరికీ తెలుసు! టాలెంట్ ఉన్నప్పటికీ, అతనికి ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదని అభిమానులు ప్రశ్నలు లేవనెత్తారు. ఇతరులు వరుసగా విఫలం అవుతున్నా ఛాన్సులు ఇస్తున్నారని, కానీ సంజూకి అవకాశాలు ఇవ్వకపోవడం నిజంగా దారుణమని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీనిపై సంజూ శాంసన్ తొలిసారి స్పందించాడు. భారత జట్టులో అంత సులువుగా చోటు దక్కదని, అది చాలా సవాళ్లతో కూడుకున్న పని అని అతడు చెప్పాడు.
‘‘టీమిండియాలో చోటు దక్కడమన్నది చాలా సవాళ్లతో కూడుకున్నది. ఆ విషయంలో పోటీ తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడున్న జట్టులోని ఆటగాళ్లకు కూడా తుది జట్టులో స్థానం దక్కాలంటే.. పోటీ తప్పదు. ఇలాంటప్పుడు నేను నా ఆటపై పూర్తి దృష్టి పెట్టడమే చాలా ముఖ్యం. అలాగే సవాళ్లని కూడా ఎదుర్కొంటూ ఉండాలి. ప్రతీసారి ఉత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తేనే.. అవకాశాలు వస్తాయి’’ అని సంజూ సమాధానమిచ్చాడు. అలాంటే బ్యాటింగ్ స్థానాలపై స్పందిస్తూ.. ‘‘బ్యాటర్లను ఒక్క స్థానానికే పరిమితం చేయకూడదు. గత మూడు, నాలుగేళ్ల నుంచి నేను వేర్వేరు స్థానాల్లో ఆడుతుండడంతో.. నా ఆటలో కొత్త కోనం వచ్చింది. ఇప్పుడు నేను ఏ ఆర్డర్‌లో అయినా ఆడగలనని విశ్వాసంతో ఉన్నా’’ అని చెప్పుకొచ్చాడు. కాగా.. ప్రస్తుతం సంజూ భారత్ ‘ఏ’ జట్టుకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గురువారం చెన్నైలో ఈ జట్టు న్యూజీలాండ్ ‘ఏ’ జట్టుతో తలపడనుంది.
Also Read
- Virat Kohli: నాకు నేనే ప్రామిస్ చేసుకున్నా.. ఇకపై అలా ఆడతా.. కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు!
- India vs Afghanistan: భారత్‌కు కలిసొచ్చిన వర్షం.. మ్యాచ్ ఆడకుండానే సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా..!
- Virat Kohli: తల దించుకోవాలి.. సాకులు చెప్పొద్దు.. పరుగెత్తను అంటే కుదరదు!
- IND vs AFG: భారత్-అఫ్గానిస్థాన్ క్వార్టర్ ఫైనల్‌కు భారీ వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుంది?
తాజావార్తలు
-
SS Rajamouli-Varanasi: జక్కన్న లెక్కలు మారాయి.. ‘వారణాసి’ ఆ మార్క్ అందుకుంటుందా?.. ఇప్పటివరకు ఒకే ఒక్క మూవీ!
-
Love And War : ‘లవ్ అండ్ వార్’ను విడిచిపెట్టని లీక్స్
-
The Paradise : ఈరోజు నుండి నాని సినిమా అసలు రంగు ఏంటో తెలియనుందా?
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
World Rabies Day 2026: కుక్క కాటు నుంచి ఎలా తప్పించుకోవాలి?.. WHO సూచించిన ముఖ్యమైన జాగ్రత్తలు
ట్రెండింగ్
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!