ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తిరుపతి నగరంలోని రెండు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ ముగిసింది. ఎన్నికల సంఘం ఆదేశాలు మేరకు చిన్నబజారులోని బూత్ నెంబర్ 229, సత్యనారాయణపురంలో బూత్ నెం.233లో రీపోలింగ్ నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. చిత్తూరు, ఉమ్మడి ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు పట్టభద్రులు, టీచర్స్ ఎం ఎల్ సి స్దానాలకు నేడు 229 , 233 పోలింగ్ బూత్ లలో రీ పోలింగ్ జరిగింది. మొత్తం కలిపి రేపు ఎస్ వి సెట్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరగనుంది. టీచర్స్ స్దానానికి 14 టేబుల్స్ , గ్రాడ్యుయేట్ స్దానానికి 40 టేబుల్స్ లో జరగనుంది కౌంటింగ్.
సార్వత్రిక ఎన్నికలకు భిన్నంగా రౌండ్స్ తో నిమిత్తం లేకుండా జరగనుంది కౌంటింగ్ ప్రక్రియ. కౌంటింగ్ రేపు ఉదయం 8 గంటలకు మొదలై ఫలితాలు వెలువడేంత వరకు జరగనుంది కౌంటింగ్. రెండురోజుల పాటు నిరంతరాయంగా కౌంటింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు అధికారులు. మూడు షిఫ్టులకు కలిపి మొత్తం 916 మంది ఎన్నికల సిబ్బంది . ఇందులో 29 మందిని రిజర్వులో ఉంచారు. త్రాగునీరు, ఎన్నికల సిబ్బంది కి భోజన సదుపాయాలు లాంటి ఏర్పాట్లను పూర్తి చేసింది జిల్లా యంత్రాంగం. కౌంటింగ్ సందర్బంగా మూడెంచెల భద్రత కల్పించింది పోలీసు శాఖ. పోలింగ్ కేంద్రం మరియు పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ విధించారు. భద్రత లో 5 మంది డియస్పిలు , 10 మంది సి ఐ లు , 14 మంది ఎస్ ఐ లు, 195 మంది సిబ్బంది పాల్గొంటారు.
Read Also: KS Bharath: కేఎస్ భరత్ వద్దు.. అతడే సరైనోడు.. టీమిండియా దిగ్గజం సంచలన వ్యాఖ్యలు