LB Stadium: కాంగ్రెస్ ప్రభుత్వం ఏళ్ల తరబడి పదోన్నతులు లేని వివిధ కేటగిరీల ఉపాధ్యాయులకు తాజాగా పదోన్నతులు కల్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా పదోన్నతి పొందిన సుమారు 30 వేల మంది ఉపాధ్యాయులతో సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సమావేశం నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎల్బీ స్టేడియంలో ఇటీవల పదోన్నతి పొందిన ప్రభుత్వ ఉపాధ్యాయులతో సీఎం ముఖాముఖి కార్యక్రమం.. ఎల్బీ స్టేడియంలో భారీ సభలో ప్రసంగించనున్నారు. అయితే.. ఉపాధ్యాయులు, సీఎం రేవంత్ రెడ్డి సభతో నేడు ఎల్బీనగర్ స్టేడియం దద్దరిల్లనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పదోన్నతులు పొందిన 2,888 మంది ఉపాధ్యాయులు ఈ సభకు తరలి వెళ్లనున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు అందాయి. విద్యాశాఖ అధికారులు, ఎంఈఓలు, మండల నోడల్ అధికారులు పదోన్నతి పొందిన ఉపాధ్యాయుల జాబితాలను రూపొందించి సమావేశానికి రావాలని సూచించారు. ఉపాధ్యాయుల సంఖ్యను బట్టి జిల్లాల వారీగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. మరోవైపు ఎల్బీనగర్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ ను మళ్లిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇవాళ ఉదయం నుంచి ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు వెల్లడించారు. ప్రయాణికులు సహరించాలని సూచించారు.
Read also: Telangana Assembly 2024: నేడు అసెంబ్లీలో మూడు ప్రభుత్వ బిల్లులపై చర్చ..
కాగా.. గురుకులాల ఉపాధ్యాయులు కూడా సమావేశానికి రానున్నారు. ఇందుకు కలెక్టర్ల ఆధ్వర్యంలో డీఈవోలు, ఇతర అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ ఉదయం ఉపాధ్యాయులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. విద్యారంగ సమస్యలతో పాటు ఉపాధ్యాయుల సమస్యలను కూడా పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో హామీ ఇస్తారా? అన్న చర్చ ఉపాధ్యాయుల్లో సాగుతోంది. అజెండాపై ఉపాధ్యాయ సంఘాల జేఏసీ బాధ్యులు మాట్లాడే అవకాశం కల్పిస్తే పదోన్నతిపై సీఎంకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు ప్రధాన సమస్యలను కూడా ప్రస్తావించే అవకాశం ఉంటుందని ఉపాధ్యాయులు భావిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఉపాధ్యాయులను పిలిపించి సభ నిర్వహించడం ప్రభుత్వానికి మేలు చేసే అంశమని చెబుతున్నారు.
Read also: Wayanad Landslides : వాయనాడ్‌లో రెస్క్యూను వేగవంతం చేసేందుకు బెయిలీ బ్రిడ్జీ నిర్మించిన సైన్యం
జిల్లాల వారిగా సీఎం సభకు బస్సులు ఏర్పాట్లు..
ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి సీఎం రేవంత్ రెడ్డి సభకు 2,888 మంది తరలిరానున్నారు. హనుమకొండ జిల్లాలో పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు 454 మంది ఉన్నారు. అదేవిధంగా వివిధ గురుకులాల ఉపాధ్యాయులు, ఇతర ఎంఎన్‌ఓల సిబ్బంది 500 మందిని తీసుకెళ్లేందుకు 10 బస్సులను ఏర్పాటు చేశారు. వరంగల్ జిల్లాలో 600 మందికి పైగా ఉపాధ్యాయుల కోసం 14 బస్సులను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 365 మంది ఉపాధ్యాయులకు 8 బస్సులు ఏర్పాటు చేశారు. ములుగు జిల్లాలో 246 మంది ఉపాధ్యాయులకు 5 బస్సులు ఏర్పాటు చేశారు. జనగామ జిల్లాలో 554 మందికి 12 బస్సులు ఏర్పాటు చేసినట్లు సమాచారం. మహబూబాబాద్ జిల్లా నుంచి 623 మందికి 15 బస్సులు ఏర్పాటు చేశారు.
Read also: AP Capital Amaravati: రాజధాని నిర్మాణంలో కీలక అడుగులు..! నేడు అమరావతికి ఐఐటీ నిపుణులు..
అందులో మరిపెడలో 5 బస్సులు, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో 10 బస్సుల వరకు అందుబాటులో ఉంచారు. ఉపాధ్యాయులంతా ఆయా జిల్లాల్లో ఈ నెల 2వ తేదీ ఉదయం 6 గంటలకే ఆయా బస్ పాయింట్లకు రావాలని విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులకు సూచించారు. పలు జిల్లాల్లోని కలెక్టరేట్ల వద్ద కూడా బస్సులను అందుబాటులో ఉంచారు. సీఎం సభకు ఉపాధ్యాయులను తరలించేందుకు వరంగల్ రీజియన్‌లోని 9 డిపోల నుంచి 65 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. హనుమకొండ డిపో నుంచి 8 ప్రత్యేక బస్సులు, పరకాల – 2, వరంగల్ – 2 – 8, వరంగల్ – 1డి – 7, నర్సంపేట – 5, భూపాలపల్లి – 8, జనగామ – 12, తొర్రూరు – 5, మహబూబాబాద్ – 10 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.
CM Revanth Reddy : గొప్ప ఆశయంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాం