Jangaon Hostel: గోడదూకి 19 మంది విద్యార్థులు జంప్.. జనగామ హాస్టల్ లో ఘటన
- జనగామ పెంబర్తిలోని మహాత్మా జ్యోతిబాఫూలే హాస్టల్‌లో వింత ఘటన..
- అర్థరాత్రి గోడ దూకి 19 మంది విద్యార్థులు పరార్..
- పిల్లలు కనిపించక పోవడంతో తల్లిదండ్రులు భయాందోళన..
- జనగామ ధర్మకంచలోని పాత వసతి గృహానికి చేరుకున్న విద్యార్థులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jangaon Hostel: జనగామ జిల్లా పెంబర్తిలోని మహాత్మా జ్యోతిబాఫూలే హాస్టల్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. అర్థరాత్రి గోడ దూకి 19 మంది విద్యార్థులు పరారయ్యారు. పిల్లలు కనిపించక పోవడంతో తల్లిదండ్రులు భయాందోళన చెందారు. సుమారు ఆరు కిలోమీటర్లు నడిచి జనగామ ధర్మకంచలోని పాత వసతి గృహానికి చేరుకున్నారు. ధర్మకంచం వద్ద పిల్లలు ఉన్నారనే సమాచారంతో తల్లదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అర్ధరాత్రి విద్యార్థులు హాస్టల్ నుంచి బయటకు వెళితే సిబ్బంది నుంచి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ధర్మకంచం హాస్టల్ ఎదుట తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పెంబర్తిలోని జ్యోతిబాఫూలే పాఠశాలలో సరైన వసతులు లేవని, ఇక్కడ ఉండడం కష్టంగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు. అధ్యాపకులు తమను వేధిస్తున్నారని, వసతులు లేవని అడిగితే ఇక్కడ ఇలాగే ఉంటుందని బెదిరిస్తున్నారని విద్యార్థులు వాపోయారు.
Read also: Drink Own Urine: ఇదేం ఖర్మ రా నాయనా.. తన మూత్రం తనే తాగుతున్న వ్యక్తి..
Also Read
జనగామలోని ధర్మకంచ హాస్టల్‌లో సౌకర్యాలు ఉన్నాయని, ఇక్కడి నుంచి పెంబర్తి హాస్టల్‌కు తరలించాలని పేర్కొన్నారు. పాత హాస్టల్‌లోనే ఉంటామంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. అధికారులు స్పందించి ధర్మకంచ హాస్టల్ లో ఉండేలా కృషి చేయాలని కోరారు. ఉపాధ్యాయులు మాట్లాడలేని భాషలో బూటకపు మాటలు మాట్లాడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పెంబర్తి హాస్టల్‌లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఉన్నాయని ప్రిన్సిపాల్ అనిత పేర్కొన్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పెంబర్తిలో మరో భవనాన్ని అద్దెకు తీసుకున్నామని, దూషించే ఉపాధ్యాయులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు.
TG DSC 2024: తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు రిలీఫ్.. రెండు పరీక్షలను ఒకేచోట రాసేందుకు ఛాన్స్..
తాజావార్తలు
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!