తాగునీటి కుండను తాకినందుకు టీచర్ తీవ్రంగా కొట్టడం వల్ల ఓ దళిత బాలుడు మృతి చెందిన ఘటన రాజస్థాన్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వానికి కొత్త చిక్కులను తెచ్చిపెడుతోంది. రాజస్థాన్‌లోని బరన్ మునిసిపల్ కౌన్సిల్‌లోని 12 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు మంగళవారం తమ రాజీనామా లేఖలను ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు పంపారు.