CPI Narayana: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలకు అందుబాటులో లేని పదవిలో జగన్ కొనసాగకూడదు.. మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలందరూ రాజీనామాలు చేయాలన్నారు. జగన్ చేష్టలు చాక్లెట్ కోసం చిన్న పిల్లలు కొట్టుకున్నట్లుంది.. జనం ఘోరంగా ఓడిస్తే జగన్ ఎందుకు ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడు అని ఆయన మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది నిజం కాదా?.. ప్రజాధనాన్ని దోచేసిన వారందరూ ఇంకా బయట తిరుగుతున్నారు.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అరెస్ట్ చేయడం లేదు.. వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని ధ్వంసం చేసిన వారిని వదిలి పెట్టొద్దు.. అందరినీ జైలుకు పంపండి అని సీపీఐ నారాయణ కోరారు.
Read Also: Vijay : విజయ్ మీద కేసు.. ముస్లిం సంఘాల ఆగ్రహం
ఇక, జగన్ యువత పోరు చేస్తుండడం హాస్యాస్పదంగా ఉందని సీపీఐ నారాయణ అన్నారు. జగన్ శైలి చూస్తుంటే అడవి నుంచి ఇప్పుడే జనం మధ్యలోకి వచ్చినట్లుంది.. ట్రంప్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నాడు.. దేశ ఆత్మగౌరవాన్ని ట్రంప్ కు నరేంద్ర మోడీ తాకట్టు పెట్టారు.. మోడీ వ్యక్తిగత ఓట్లు తగ్గిపోయాయి, పార్టీ బలం తగ్గిపోయింది అని పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ ఓటమికి మోడీ బ్లాక్ మెయిలింగ్ ప్రధాన కారణమని చెప్పుకొచ్చారు. ఆడవాళ్ళు ఉత్పత్తి యంత్రాలు కాదు.. బిడ్డల్ని కనమని చెప్పడం మంచి పద్ధతి కాదు.. హిందీని బలవంతంగా దక్షణాది రాష్ట్రాలపై రుద్దాలనుకోవడం మోడీ అహంకారానికి నిదర్శనం అని నారాయణ వెల్లడించారు.