CM Chandrababau: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్ వివేక మరణంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ఎన్నికల హడావిడిలో ఉండగా వైఎస్ వివేకా హత్య కేసు వెలుగులోకి వచ్చిందన్నారు. అప్పుడు అర్ధం కాని పరిస్థితి నెలకొందన్నారు. హోం మంత్రి, ఉన్నతాధికారులు, డీజీపీ ఇంత మంది ఉండి కూడా వివేకా హత్య అర్ధం కాలేదు.. ఆయనది గుండెపోటు అనుకున్నాం అని చెప్పుకొచ్చారు. సునీత పోస్టుమార్టం అన్నారు కాబట్టి అసలు విషయం తెలిసింది.. నా చేతిలో కత్తి ఫోటో పెట్టి.. నారా సుర రక్త చరిత్ర అని రాయించారు అని చంద్రబాబు మండిపడ్డారు.
Read Also: SSMB-29: హనుమంతుడి స్ఫూర్తితో ఎస్ ఎస్ ఎంబీ-29 కథ.. అదిరిపోయే ఫ్లాష్ బ్యాక్..?
ఇక, నా రాజకీయ జీవితంలో హత్యా రాజకీయాలు లేవు అని సీఎం చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు జాగ్రత్త ఉండాలి.. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చెయ్యడం ఎమ్మెల్యేల బాధ్యత అని పేర్కొన్నారు. రాజకీయ ముసుగులో ఎదురు దాడి చేస్తే తప్పించు కోలేరు.. ప్రేమ పేరుతో మహిళలను ముగ్గులోకి దింపుతున్నారు.. ఇలాంటివి సహించేది లేదు.. చిన్న చిన్న అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుతున్నాయి.. ఎక్కడ గంజాయి, డ్రగ్స్ దొరికినా అయిపోతారు జాగ్రత్త అని ఆయన వార్నింగ్ ఇచ్చారు. సమస్యలు చెప్పాలనుకుంటే చెప్పండి.. కానీ, రౌడీయిజం చేస్తే ఊరుకోం.. శక్తి యాప్ అందరూ ఇంస్టాల్ చేసుకోవాలి.. ఒకసారి ఫిర్యాదు చేస్తే పోలీసులు వెంటనే బాధ్యత తీసుకోవాలి.. పోలీసులు జాగ్రత్తగా లేకపోతే వారిపై కూడా చర్యలు ఉంటాయి.. దిశ యాప్ ఒక దిక్కుమాలిన యాప్.. శక్తి యాప్ మహిళలు ఉపయోగించుకోవాలన్నారు. ప్రజల్లో చైతన్యం లేకపోతే చట్టాలు వృథా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు.