ఏపీలో నిరసన జ్వాలలు చెలరేగాయి. నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ అధినేత తనను వ్యక్తిగతంగా దూషించారని ఆరోపిస్తూ సభను బయటకు వచ్చేశారు. అనంతరం తన ఛాంబర్ టీడీఎల్సీ సమావేశం నిర్వహించి మీడియాతో మాట్లాడారు. ఆయన మీడియాతో ముచ్చటిస్తూనే కన్నీటి పర్యంతమయ్యారు. తమ అభిమాన నేత ఇలా కన్నీరు పెట్టుకోవడాన్ని చూసిన టీడీపీ శ్రేణులను ఆవేదన గురి చేసింది. దీంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో టీడీపీ శ్రేణులు నిరసన, ఆందోళనకు దిగారు.…
టీడీపీ అధినేత చంద్రబాబు కంటతడి పెట్టిన ఎపిసోడ్ పై నారా రోహిత్ తన దైన స్టైల్ లో స్పందించారు. వైసీపీ పార్టీ చాలా దారుణంగా వ్యవహరిస్తుందని ఫైర్ అయ్యారు. పశువుల కంటే హీనంగా కొందరు అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని నారా రోహిత్ వ్యక్తులు చెరిగారు. సమస్యల గురించి చర్చించాల్సిన అసెంబ్లీలో చంద్రబాబు ను, ఆయన సతీమణి భువనేశ్వరి ని దూషించడం దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలిపారు. రాజకీయాలపై అలాగే విధానాలపై విమర్శలు ఉండాలి కాని కుటుంబ…
వైసీపీ సర్కార్ పై టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు యనమల ఫైర్ అయ్యారు. అధికారం పోతుందనే భయం వైసీపీలో మొదలైందని… ఆ భయంతోనే అసెంబ్లీలో వైసీపీ అడ్డగోలుగా వ్యవహరిస్తోందని ఆగ్రహించారు. సభలో ప్రజా సమస్యలు ప్రస్తావనకు రాకుండా చేయడమే వైసీపీ ఉద్దేశమన్నారు. రంగా, మాధవరెడ్డి, మల్లెల బాబ్జీ అంశాలు ఈనాటివా..? ఆ అంశాలకు.. సభలో జరిగిన ఘటనలకు ఏమమన్నా సంబంధం ఉందా..? అని ఫైర్ అయ్యారు. తన గురించి పోరాడిన తల్లి-చెల్లికి జగన్ ఏం గౌరవం ఇస్తున్నారు..? అని…
ఏపీలో రాజకీయాలు భగ్గుమన్నాయి. నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు తనను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని, నా భార్య శీలాన్ని కించపరిచేవిధంగా మాట్లాడుతున్నారంటూ సభలోంచి వెళ్లిపోయారు. అంతేకాకుండా మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడుతానంటూ శపథం చేశారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరుపెట్టుకున్నారు. అప్పటినుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనజ్వాలలు రగులుతున్నాయి. ఈ నేపథ్యంలో నందమూరి కుటుంబ సభ్యులు బాలకృష్ణ నేతృత్వంలో…
చంద్రబాబు కంటతడి పెట్టిన ఘటన బాలయ్య కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు… మీడియా ముందుకు వచ్చిన బాలయ్య కుటుంబం… వైసీపీపై ఫైర్ అయింది. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీలో క్యారెక్టర్ అస్సాసినేషన్ మంచిదికాదని మండిపడ్డారు బాలయ్య. గొడ్ల చావిట్లో ఉన్నామా, అసెంబ్లీలో ఉన్నామా అన్న అనుమానం కలుగుతోందని ఆగ్రహించారు బాలకృష్ణ. మంచి సలహాలు ఇచ్చినా తీసుకునే పరిస్థితిలో ప్రభుత్వం లేదన్ని ఫైర్ అయ్యారు బాలకృష్ణ. ఇకనైనా వైసీపీ తన పద్దతిని మార్చుకోవాలన్నారు. మీరు మారక…
నిన్నటి రోజున ఏపీ అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వైసీపీ నేతలు వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేసిన చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ లో కన్నీళ్లు పెట్టుకున్నారు. పర్సనల్గా విమర్శించడం తగదని తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే. అటు బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అసెంబ్లీలో జరిగిన విషయాలను ఖండించారు. Read: అనగనగా ఓ గ్రామం … ఆ గ్రామంలో…
టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కంటతడి పెట్టడం పై ఎమ్మెల్యే బాలయ్య స్పందించారు. ఇవాళ తన నివాసం లో ప్రెస్ మీట్ నిర్వహించిన బాలయ్య బాబు.. వైసీపీ తీరుపై మండి పడ్డారు. తమ సోదరి భువ నేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యే మాట్లాడటం చాలా దారుణమని నిప్పులు చెరిగారు. అసలు ఓ మహిళపై విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు బాలయ్య. ఇష్యూ మీద మాట్లాడాలి… కానీ.. దానికి సంబంధం లేని బయట ఉన్న మహిళలపై మాట్లాడటం దారుణమన్నారు.…
అమరావతి : ఏపీ జగన్ పై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. సీఎం జగన్ వరదల పై శద్ర పెట్టకుండా బురద రాజకీయాలు చేస్తూ ఎదుటివారిపై బురద చల్లే ప్రయత్నం సిగ్గుచేటు అని మండిపడ్డారు. జగనుకి కుప్పంలో దొంగ ఓట్లు వేయించటంపై ఉన్న శ్రద్ద వరద బాధితులను ఆదుకోవటంలో లేదని… జగన్.. ఇకనైనా బురద రాజకీయాలు ఆపి వరద బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకుతక్షణమే ఆర్దిక సాయం అందించాలని…