ప్రళయంలోనూ..వేడెక్కుతున్న ఏపీ రాజకీయాలు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అయితే… ఈ ప్రళయంలోనూ ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. చంద్రబాబు కంటతడితో.. ఏపీ రాజకీయాలు భగ్గుమన్నాయి. చంద్రబాబు కుటుంబ సభ్యులపై వ్యక్తిగత ఆరోపణల ఎపిసోడ్‌లో.. టీడీపీ-వైసీపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. మరోవైపు రంగంలోకి దిగిన నందమూరి, నారా కుటుంబ సభ్యులు.. వైసీపీ నేతల వ్యక్తిగత ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. రాజకీయాలతో సంబంధం లేని మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు క్షమించరానిదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో తన కుటుంబాన్ని వైసీపీ నేతలు దూషించారంటూ చంద్రబాబు కన్నీటి పర్యంతం కావడం తీవ్ర సంచలనం రేపింది. ఈ పరిణామం ఏపీలో రాజకీయ దుమారం సృష్టిస్తోంది. వైసీపీ నేతల తీరుపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో చంద్రబాబుకు అండగా నందమూరి ఫ్యామిలీ కూడా రంగంలోకి దిగింది.బాలకృష్ణతో పాటు నందమూరి కుటుంబ సభ్యులంతా కలిసి ప్రెస్ మీట్ పెట్టి.. వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. రాజకీయాలతో సంబంధం లేని ఓ మహిళలపై దూషణలకు దిగడం హేయమైన చర్య అన్నారు.
Also Read
తమ కుటుంబం జోలికి ఎవరు వచ్చినా వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు. అసెంబ్లీలో ఉన్నామో, పశువుల దొడ్డిలో ఉన్నమో అర్థం కావడం లేదన్నారు బాలకృష్ణ. ఏపీలో నీచ సంస్కృతికి తెరలేపారని విరుచుకుపడ్డారు.టీడీపీ, నందమూరి ఫ్యామిలీ ఆరోపణలకు వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. చంద్రబాబు సతీమణిని ఎవరూ ఏమి అనలేదని.. రాజకీయాల కోసమే టీడీపీ అధినేత ఈ విషయాన్ని వాడుకుంటున్నారని మండిపడ్డారు. నందమూరి కుటుంబ సభ్యులు అనవసరంగా విమర్శలు చేస్తున్నారని.. నిజాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు మంత్రి పేర్నినాని. నందమూరి ఫ్యామిలీ ప్రెస్‌మీట్ పెట్టడాన్ని అటు లక్ష్మీ పార్వతీ కూడా తప్పుబట్టారు. ఎన్టీఆర్‌ను చంద్రబాబు మానసిక క్షోభకు గురి చేసినప్పుడు వీరంతా ఎక్కడున్నారని ప్రశ్నించారు.
- Tags
- chandrababu
- tdp
- ycp
తాజావార్తలు
-
Team India Mission 300: టీమిండియా ‘మిషన్ 300’.. ఇక ప్రత్యర్థులకు దబిడిదిబిడే!
-
Picnic: ప్రేమలు మేకర్స్ నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్.. సంక్రాంతికి ‘పిక్నిక్’!
-
22 US Soldiers Killed in Iran War?: ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికుల మరణాలపై సంచలన నివేదిక.. 22 మంది మృతి?
-
CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
-
Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..