ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభమైంది… ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి చర్చనుప్రారంభించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన మాట్లాడుతూ.. కరోనా సమయంలో కూడా ఆర్థిక ప్రగతి బాగానే ఉందన్నారు.. కరోనా సమయంలో పేదలకు అనేక సంక్షేమ పథకాలు కూడా అందించామని.. పేదరికాన్ని తగ్గించాలంటే విద్యతోనే సాధ్యం.. అందుకే విద్యకే అధిక ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు.. చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే ఒక్క పథకం కూడా లేదంటే…
ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడవరోజు కొనసాగుతున్నాయి. ఏపీ అసెంబ్లీ ప్రశ్నోత్తరాలు సుదీర్ఘంగా కొనసాగుతున్నాయి.విద్యాశాఖ ప్రమాణాలు, పాఠశాలల్లో స్వీపర్ల వేతనాలపై గంటన్నరకు పైగా చర్చ జరిగింది. విదేశీ విద్య నిలిపేశారంటూ అచ్చెన్నాయుడు ఆరోపణలు చేశారు. నాడు-నేడు పనులు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయన్నారు విపక్ష సభ్యులు. అమ్మ ఒడి డబ్బుల్లో పరిశుభ్రత కోసం అంటూ కోత విధిస్తున్నారని.. నాడు-నేడు పనులు జాప్యం జరుగుతున్నాయన్న టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి లేవనెత్తారు. పెద్ద ఎత్తున జరుగుతోన్న పనులను పక్కన పెట్టి..…
TDLP Leader Gorantla Butchaiah Chowdary held protest rally at Secretariat to Assembly. ఏపీ ఆసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే నేడు రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో నిరుద్యోగుల్ని ముఖ్యమంత్రి మోసగించారంటూ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన చేపట్టారు. కాంట్రాక్టు ఉద్యోగుల్ని వెంటనే రెగ్యులరైజ్ చేసి ఖాళీలను భర్తీ చేయాలంటూ నినాదాలు చేశారు. సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీకి నిరసన ర్యాలీని టీడీఎల్పీ ఉప నేత…
Telugu Desam Party Women President Vangalapudi Anita Reacted Strongly To The Remarks Made by YCP MLA Prasanna Kumar Against Her. ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితపై విమర్శలు గుప్పించారు. దీనిపై స్పందించిన వంగలపూడి అనిత మాట్లాడుతూ ప్రసన్నకుమార్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి టీడీపీ భిక్షతో 3సార్లు ఎమ్మెల్యే అయ్యారని ఆమె విమర్శించారు.…
త్వరలోనే ఎన్నికలకు వెళ్లాలని సీఎం జగన్ భావిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు. తాము కూడా ఎన్నికలు రెడీగా ఉన్నామని చెప్పారు. నెత్తిమీద కుంపటిని దించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడం ఖాయమన్నారు చంద్రబాబు. రేపో ఎల్లుండో సీఎం జగన్ ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారన్న చంద్రబాబు.. రోజు రోజుకూ పతనావస్థకు వెళ్తున్నారని.. మరిన్ని రోజులు గడిస్తే వ్యతిరేకత పెరుగుతుందని సీఎం భయపడుతున్నారని తెలిపారు.. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా…
ఎన్ని మహిళా దినోత్సవాలు జరుపుకుంటున్నా ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని టీడీపీ మండిపడింది. నెల్లూరులో టీడీపీ ఆధ్వర్యంలో నారీ సంకల్ప దీక్ష నిర్వహించింది. టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతి, అసమర్థ నాయకుని పాలన ఎలా ఉంటుందో జగన్ ను చూస్తే అర్డంవుతుందన్నారు అనిత. వైసీపీ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ.. మహిళల్లో చైతన్యం తెచ్చేందుకే నారీ సంకల్ప దీక్ష చేపట్టాం అన్నారు. పాదయాత్రలో తల నిమిరి ముద్దులు పెట్టిన జగన్..…
ఈ నెల 7వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఇప్పటికే గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే, అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలా? వద్దా? అనేదానిపై మల్లగుల్లాలు పడుతూ వచ్చిన ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ చివరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయం తీసుకుంది.. మొదట పొలిట్‌బ్యూరో సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సెషన్‌ను వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నా… ఇవాళ జరిగిన టీడీఎల్పీ సమావేశంలో మాత్రం సభకు వెళ్లేందుకే…
వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై కూడా అసెంబ్లీలో చర్చించడానికి సిద్ధంగా ఉన్నమని ప్రకటించారు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి.. అసెంబ్లీ సమావేశాల పై స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు అన్ని శాఖల అధికారులుతో సమీక్ష నిర్వహించారు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి.. అసెంబ్లీలో ప్రజాసమస్యలను అత్యంత ప్రధాన్యంగా సమావేశాలు నిర్వహిస్తాం అన్నారు.. ప్రజా సమస్యలపై ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందన్న ఆయన.. గతంలో టీడీపీలా కాకుండా మేం ప్రతిపక్షాన్ని…
చంద్రబాబు పోలవరం బ్యారేజీ కడదామనే భ్రమలో ఉన్నారంటూ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ సెటైర్లు వేశారు. అందుకే పోలవరం బ్యారేజీ అంటున్నారని, మేము కడుతుంది పోలవరం ప్రాజెక్టేనని ఆయన అన్నారు. అంతేకాకుండా దీనిపై ఎవరితోనైనా ఓపెన్ డిబెట్ కు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. ఒక్క క్యూసెక్కు నీరు చుక్క తగ్గకుండా నీరు స్టోరేజ్ చేస్తామని, చంద్రబాబు తప్పిదాలు కారణంగా డయాఫ్రం వాల్ పునఃనిర్మాణం చేయాల్సి వస్తుందన్నారు. రాజమండ్రి నగరంలో 35 కోట్ల…
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అసెంబ్లీకి సైకిల్‌పై బయల్దేరారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడానికి టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఉచితంగా అందజేయాలని డిమాండ్ చేస్తూ రామానాయుడు సైకిల్ యాత్ర ప్రారంభించారు. నిమ్మల రామానాయుడు చేపట్టిన సైకిల్ యాత్ర పాలకొల్లు నుంచి అమరావతి సాగనుంది. ఆయనకు టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. పాలకొల్లులో తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రోజారమణి హారతిచ్చి ఎమ్మెల్యే నిమ్మల సైకిల్ యాత్రకు ఎదురు…