టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై తీవ్రస్తాయిలో విరుచుకుపడ్డారు ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు ఆర్యవైశ్యులపై కపట ప్రేమ చూపిస్తున్నారని ఆరోపించారు.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాచర్లలో గోపవరపు మల్లిఖార్జునరావును వేధించడంతో హఠాత్తుగా చనిపోయారని విమర్శించిన ఆయన.. చంద్రబాబు నిర్ణయాలతో ఆయన భార్య శ్రీదేవి కూడా చనిపోయారన్నారు.. ఇక, సొంత పార్టీలో ఉన్న శిద్ధా రాఘవరావును అవమానాలకు గురి చేశారని పేర్కొన్న మంత్రి వెల్లంప్లి… అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిగా ఉన్న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కూడా మార్చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆర్య వైశ్యుల ద్రోహులుగా పేర్కొన్న వెల్లంపల్లి శ్రీనివాస్.. మాజీ సీఎం రోశయ్య బతికున్నప్పుడు చంద్రబాబు అనేక విధాలుగా ఇబ్బంది పెట్టారని విమర్శించారు.
Read Also: Sister Love: అన్నకు ప్రేమతో.. చెల్లి కోసం మళ్లీ బతికి, వేడుకకు హాజరై..!