రాష్ట్రపతి ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. పట్టుమని పది రోజుల సమయం కూడా లేదు. దేశంలోని ప్రధాన పార్టీలతోపాటు.. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పక్షాలు దేశాధ్యక్షుడి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలో నిర్ణయం తీసేసుకున్నాయి. కానీ.. ఇప్పటి వరకు టీడీపీ నిర్ణయం ఏంటన్నది బయటకు రాలేదు. పార్లమెంటులో.. అసెంబ్లీలో పెద్దగా ప్రభావం చూపని స్థితిలో టీడీపీ సభ్యులు ఉన్నారు. జగన్‌కు జైకొట్టగా మిగిలిన 20 మంది ఎమ్మెల్యేలు.. ముగ్గురు లోక్‌సభ, ఒక రాజ్యసభ సభ్యుడు తెలుగుదేశానికి ఉన్నారు.…
మంత్రి ఆర్కే రోజా సొంత నియోజకవర్గం నగరిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఓ వైపు దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతిని పురస్కరించుకుని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు బ్యానర్లు, ఫ్లెక్సీలు కడితే.. మరో వైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహిస్తోన్న బాదుడే బాదుడు కార్యక్రమం సందర్భంగా పెద్ద ఎత్తున బ్యానర్లు, ఫ్లెక్సీలు పెట్టాయి టీడీపీ శ్రేణులు.. దీంతో.. నగరి టౌన్లో ఎటు చూసినా వైసీపీ వర్సెస్ టీడీపీ…
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరో వివాదం చిక్కుకున్నారు.. ఆయన హైదరాబాద్ శివారులో కోడిపందాల్లో పాల్గొనడం హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ నగర శివార్లలో కోడిపందాల దగ్గరకు వెళ్లిన చింతమనేని ప్రభాకర్.. పోలీసులు రాగానే చల్లగా జారుకున్నారు. అయితే, కోడిపందాల్లో తాను లేనంటూ సోషల్ మీడియాలో ఆయన పేర్కొన్నారు.. కానీ, దీనికి ఓ వీడియోతో కౌంటర్ ఇచ్చారు పోలీసులు.. ఘటనా స్థలంలో చింతమనేని ప్రభాకర్ ఉన్న వీడియోను విడుదల చేశారు..…
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్లీనరీ వేదికగా పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేస్తారు.. 2024 టార్గెట్‌గానే ఈ ప్లీనరీ ఉంటుందని తెలిపారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు తెలుగుదేశం పార్టీ నేత, మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి.. పెద్దిరెడ్డి ఏమీ పెద్ద లీడర్ కాదన్న ఆయన.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బొమ్మ లేకుండా సొంతం బొమ్మతో పోటీ చేయగలరా..? పోటీ చేసి గెలిచే దమ్ము ఉందా…? అంటూ ఓపెన్ చాలెంజ్ విసిరారు.. ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు…
ఒక క్లాస్ కు ఒక టీచర్ కాకుండా కేంద్ర సిలబస్ ప్రకారం సబ్జెక్ట్‌కు ఒక టీచర్ విధానం తీసుకుని వస్తున్నాం.. రాష్ట్రంలో ఒక్క స్కూల్ కూడా మూసివేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
ఎడమ చేతి చూపుడు వేలుకు రింగ్ ధరించారు చంద్రబాబు.. ఆధునిక సాంకేతికతతో కూడిన రింగ్ కావడం మరో విశేషం.. ఆ రింగ్‌లో మైక్రో చిప్ అమర్చబడి ఉంటుందని తెలిపారు చంద్రబాబు.