ఉమ్మడి విశాఖ జిల్లాలో కీలకమైన నియోజకవర్గాల్లో పెందుర్తి ఒకటి. అర్బన్, గ్రామీణ ప్రాంతాల కలబోత కావడంతో ఇక్కడి రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమే. ప్రధాన పార్టీల ఫోకస్ కూడా ఎక్కువే. ఇక్కడ ఒకసారి గెలిచిన ఎమ్మెల్యే.. తర్వాత ఎన్నికల్లో గెలవకపోవడం పెందుర్తి సెంటిమెంట్. 2019లో ఈ సీటును వైసీపీ గెలుచుకోగా.. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి టీడీపీ పుంజుకుంది. ఇప్పుడు మళ్లీ ఎలక్షన్ మూడ్ వచ్చేసింది. పెందుర్తిపై పట్టుకోసం వైసీపీ, టీడీపీ వేయని ఎత్తుగడలు లేవు. అయితే ప్రతిపక్ష…
చిక్కాల రామచంద్రరావు. టీడీపీ సీనియర్ నేత. మొదట నుంచి పార్టీలో ఉన్నప్పటికి ఒక్క ఓటమితో ఆయనకి నియోజకవర్గం అంటు లేకుండా పోయింది. 2012లో చివరిసారిగా అసెంబ్లీకి పోటీ చేసిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో మరోసారి అదృష్టం పరీక్షించుకోవాలని చూస్తున్నారట. ఇందుకు నియోజకవర్గాన్ని కూడా ఎంచుకుని గ్రౌండ్వర్క్ చేసుకుంటుండంతో కాకినాడ జిల్లా టీడీపీలో ఒక్కసారిగా చర్చల్లోకి వస్తున్నారు. తాళ్లరేవు నుంచి 1983లో తొలిసారి ఇండిపెండెంట్గా గెలిచిన చిక్కాల..1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో వరసగా సైకిల్ పార్టీ నుంచి…
సింహాచలం దేవస్ధానం ట్రస్ట్ బోర్డు వివాదం ఇప్పట్లో చల్లారేటట్టు కనిపించడం లేదు. కోర్టు నిర్ణయానికి అనుగుణంగా అనువంశిక ధర్మకర్త, చైర్మన్గా అశోక్ గజపతిరాజు తిరిగి బాధ్యతలు చేపట్టారు. ట్రస్ట్ బోర్డ్ సభ్యులు, ఆహ్వానితులుగా అధికారపార్టీకి అనుకూలమైన వ్యక్తులు నామినేట్ అయ్యారు. పాలకమండలి కూర్పు ప్రభుత్వ నిర్ణయాధికారమే అయినప్పటికీ.. అది కొలువుతీరిన తీరు చర్చగా మారింది. చైర్మన్గా అశోక్ గజపతిరాజుకు ఆహ్వానం లేకుండానే అధికారులు కథ నడిపించేశారు. ఈ అంశాన్ని అశోక్ సీరియస్గా తీసుకుని న్యాయ సలహా కోరడంతో…
నారా చంద్రబాబు నాయుడు.. నల్లారి కిరణ్ కుమార్రెడ్డి. ఇద్దరూ మాజీ ముఖ్యమంత్రులే. నియోజకవర్గాలు.. పార్టీలు వేరైనా చిత్తూరు జిల్లా వాసులే. ఇద్దరికీ జిల్లాలో సొంత ఊళ్లల్లో తాతల కాలం నాటి ఇళ్లు ఉన్నాయి. ఇద్దరూ సొంతంగా ఇళ్లు నిర్మించుకున్న పరిస్థితి లేదు. కానీ.. వివిద కారణాలతో చంద్రబాబు, కిరణ్కుమార్రెడ్డిలు వేర్వేరు ప్రాంతాల్లో ఒకేసారి సొంత ఇంటి నిర్మాణం దిశగా అడుగులు వేయడం ఆసక్తిగా మారింది. ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన చంద్రబాబు సొంతూరు చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజవర్గంలోని…
మతుకుమిల్లి శ్రీభరత్. గీతమ్ చైర్మన్గా, హీరో బాలకృష్ణ చిన్న అల్లుడుగా సుపరిచితం. గత ఎన్నికల ముందు అనూహ్యంగా శ్రీభరత్ పేరును తెరపైకి తెచ్చింది టీడీపీ. వైజాగ్ ఎంపీగా పోటీ చేయించింది. హోరాహోరీగా సాగిన త్రిముఖ పోటీలో భరత్ 4 వేల ఓట్ల తేడాతో పోడిపోయారు. కాకపోతే విశాఖ లోక్సభ పరిధిలోని 4 అసెంబ్లీ స్ధానాలను టీడీపీ గెలుచుకుంది. విశాఖ పశ్చిమ, దక్షిణ, తూర్పు నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలకు బంపర్ మెజార్టీ వచ్చినప్పటికీ ఎంపీగా శ్రీభరత్ ఓటమి అప్పట్లో…
టీడీపీ ఆవిర్భవించినప్పుడు యూత్ లుక్ ఎక్కువ. తర్వాత యువతను ప్రోత్సహించిన సందర్భాలు అరుదే. తెలుగుదేశం ఆవిర్భవించిన 40 ఏళ్ల తర్వాత… రాబోయే ఎన్నికల్లో 40 శాతం మంది యువతకే ప్రాధాన్యం అన్నది ప్రస్తుతం చంద్రబాబు మాట. 2019 ఎన్నికల తర్వాత పార్టీకి గడ్డుకాలం నడుస్తోంది. దీనికితోడు ఇంఛార్జుల పేరుతోనో.. సీనియర్లు అనే హోదాలోనో చాలా మంది లీడర్లు ఎక్కడికక్కడ పాతుకుపోయారు. వారు పనిచేయరు.. మిగిలిన వారికి అవకాశం ఇవ్వరు అనే విమర్శలు పసుపు శిబిరంలోనే ఉన్నాయి. వచ్చే…
గత నెల 19న డ్రైవర్ సుబ్రమణ్యం హత్య జరిగింది. ఆ తర్వాత నాలుగు రోజులకు ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేశారు పోలీసులు. మధ్యలో ఆ నాలుగు రోజులపాటు ఎమ్మెల్సీ పెళ్లిళ్లు, పేరంటాలుకు తిరుగుతూ పెద్ద హంగామానే చేశారు. అరెస్ట్ తర్వాత అనంతబాబు ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆ సమయంలో ఎమ్మెల్సీ మాట్లాడిన కాల్స్ వ్యవహారంలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఆ నాలుగు రోజుల్లో అనంతబాబు ఎక్కువగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుతో మాట్లాడారట. చంటిబాబు జగ్గంపేట…