YCP :అధిష్టానం మందలించిన అక్కడి నేతల తీరు మారటం లేదా..? ఏంటా అసమ్మతి గోలా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూడు గ్రూపులు.. ఆరు వర్గాలు. ఎవరి కుంపటి వారిదే. అధిష్ఠానం మందలించినా నేతల తీరు మారడం లేదట. అదేదో సాధారణ నియోజకవర్గం కాదు. పెద్ద పొజిషన్‌లో ఉన్న సీనియర్ పొలిటీషియన్ సెగ్మెంట్ కావడంతో రచ్చ రచ్చ అవుతోంది. ఇంతకీ ఏంటా నియోజకవర్గం? ఏమా అసమ్మతి గోల? లెట్స్ వాచ్..!
శ్రీకాకుళం జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో ఆరుచోట్ల వైసీపీ పాగా వేసింది. గెలిచిన కొత్తలో బాగానే ఉన్నా.. ఆ ఆరు చోట్లా ఎమ్మెల్యే పేరు చెబితేనే కస్సు మంటున్నారు పార్టీ నాయకులు. ఆమదాలవలస నియోజకవర్గంలో ఈ అసమ్మతి పోరు మరీ ఎక్కువగా ఉందట. ఇక్కడ నుంచి గెలిచిన తమ్మినేని సీతారాం.. స్పీకర్‌గా పెద్ద పొజిషన్‌లో ఉన్నారు. కానీ.. సెగ్మెంట్‌లో వైసీపీని మూడు గ్రూపులు లీడ్ చేయడం చర్చగా మారుతోంది. ఒక గ్రూప్ తమ్మినేని.. మరో గ్రూప్ పార్టీ నేత చింతాడ రవికుమార్, మూడో గ్రూప్‌కు సువ్వారి గాంధీ నాయకత్వం వహిస్తున్నారట. టీడీపీ కంటే.. తమ్మినేని వర్గంపై మిగతా ఇద్దరు నేతలు చేస్తున్న విమర్శలే చాలా పదునుగా ఉంటున్నాయట. సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారు.
Also Read
తమ్మినేనితో విభేదించిన కోట బ్రదర్స్ వంటి ద్వితీయ శ్రేణి నాయకులను గాంధీ, రవికుమార్ ప్రోత్సహిస్తున్నారనే వాదన ఉంది. దీంతో ఆమదాలవలస, పొందూరు, భూర్జ, సరుబుజ్జిలి మండలాల్లో ఈ ముగ్గురు నేతలకు అనుచర గణం ఉంది. పార్టీ కార్యక్రమాలను కలిసి నిర్వహించే పరిస్థితి లేదు. ఇదే కాదు.. ఆమదాలవలసలో ఎవరికి వారే వైసీపీ ఆఫీసులు పెట్టేసుకున్నారు కూడా. ఆ మధ్య నిర్వహించిన నియోజకవర్గ వైసీపీ ప్లీనరీకి గాంధీ, రవి ఇద్దరూ డుమ్మా కొట్టేశారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన ప్లీనరీకి మాత్రం ఇద్దరూ హాజరయ్యారు. అంతేకాదు.. తమ్మినేని కంటే ఎక్కువ మందిని జిల్లా ప్లీనరీకి తీసుకెళ్లారని పార్టీ వర్గాల్లో చర్చకు పెట్టేశారు.
అసమ్మతి వర్గాన్ని తమ్మినేని ఎందుకు కలుపుకొని వెళ్లడం లేదని పార్టీ కేడర్ ప్రశ్నిస్తోంది. సమస్యను పెంచుకుంటున్నారే తప్ప.. పరిష్కారానికి చొరవ తీసుకోవడం లేదని చెవులు కొరుక్కుంటున్నారు. ఇలాగే ఉపేక్షిస్తే ఎన్నికల నాటికి అసమ్మతి ఇంకెలాంటి తీవ్ర రూపు దాల్చుతుందో అని వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయట. తమ్మినేని పాల్గొనే కార్యక్రమాలకు ఆ ఇద్దరూ రావడం లేదు. దాంతో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపైనా ఆ ప్రభావం కనిపించింది. అలా అని అసమ్మతి వర్గాలు మౌనంగా ఉండటం లేదు. వారి స్థాయిలో వారు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తమ్మినేనిపై వారే విమర్శలు చేస్తుండటంతో టీడీపీకి పెద్దగా పనిలేకుండా పోయింది. ఈ సమస్య అధిష్ఠానం దృష్టిలో ఉండటంతో వారే చికిత్స చేస్తారని ఆశిస్తున్నారు. మరి.. ఆ టైమ్ ఎప్పుడొస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Chiranjeevi : బ్లడ్ అమ్ముకున్నానని అవమానించారు..
-
Mohan Babu: “ఆ సినిమా చూస్తే మీరు నా దగ్గరకు కూడా రారు..” మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
-
Garba row: ‘‘మీ సోదరిమణుల్ని తీసుకురండి’’.. ముస్లింల గర్బా ఎంట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు..
-
UPI Payments: యూపీఐ చార్జీలపై మరోసారి కేంద్రం క్లారిటీ..
-
Kayadu Lohar: పురాణాల్లోని ఆ రాక్షసుడి భార్య పేరు నాకు పెట్టారు.. తండ్రి చేసిన పనిని బయటపెట్టిన కయాదు!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!