స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ పై విచారణ ప్రారంభం అయింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం ముందు వాదనలు కొనసాగుతున్నాయి.
ఇవాళ( మంగళవారం ) మధ్యాహ్నం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ సమావేశం కానుంది. తాజా రాజకీయ పరిణామాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. తెలుగు దేశం పార్టీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్పొత్తు పెట్టుకుంటానన్న ప్రకటనపై బీజేపీ కోర్ కమిటీలో కీలక చర్చ జరిగే అవకాశం ఉంది
ఏపీ లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి వైసీపీ విజయభేరిని మోగించడం ఖాయమని తాజాగా టైమ్స్ నౌ సర్వేలో తేలింది. వైసీపీ ఈ సారి 24 నుంచి 25 లోక్‌సభ స్థానాల్లో గెలిచి క్లీన్‌స్వీప్ చేయనుందని సర్వే స్పష్టం చేసింది. టైమ్స్ నౌ నిర్వహించిన ఈ సర్వేలో వైస్సార్సీపీ విజయం తథ్యమని వెల్లడించింది.
సన్నాసి అంటే తిట్టు కాదు.. ఏమి లేనివాడు అని అర్థమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వైసీపీవాళ్లు ఆ మాటకు బాధపడితే భవిష్యత్‌లో ఆ మాట మాట్లాడను.. అది కూడా వారి ప్రవర్తన బట్టి ఉంటుందన్నారు.
కులాల గురించి ఆలోచిస్తే ఎప్పటికీ అభివృద్ధి సాధించలేమని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ వెల్లడించారు. వారాహి యాత్రలో భాగంగా మచిలీపట్నంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. మచిలీపట్నానికి చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. గాంధీ జయంతి రోజున ఢిల్లీ నుంచి గల్లీ దాకా టీడీపీ నేతలు సత్యమేవ జయతే దీక్ష పేరుతో ఒక్క రోజు నిరాహార దీక్షకు పూనుకున్నారు.