టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో ఏపీలో రాజకీయం వేడెక్కింది. అయితే.. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ టీడీపీ నేతలు వినూత్న కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు కాంతితో క్రాంతి కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ సందర్భంగా టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఆధారాల్లేకుండా స్కిల్ కేసు వేశారని, సంబంధం లేకున్నా ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ అంశాల్లోనూ కేసులు పెట్టారన్నారు. నాటి ప్రభుత్వంలో తీసుకున్న విధాన నిర్ణయాల వల్ల ప్రజలకు చాలా మేలు జరిగిందన్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను నిలదీస్తున్నందుకే చంద్రబాబును జుడిషియల్ కస్టడీలో పెట్టారన్నారు. జగన్ ప్రభుత్వం పంచభూతాలను దోచుకుంటోంది.. ఆ దోపిడీని ప్రశ్నిస్తే బాబును జుడిషియల్ కస్టడీలో పెట్టారని, మద్యం, భూములు, ఇసుక వంటి వాటిల్లో ప్రభుత్వ అడ్డగోలు దోపిడీని ప్రశ్నించారని చంద్రబాబును జైల్లో పెట్టారన్నారు అచ్చెన్నాయుడు.
Also Read : Harish Rao : కాంగ్రెస్ పార్టీ అంటే మాటలు, మూటలు, మతాల మంటలు
అంతేకాకుండా.. ‘ఇరిగేషన్ రంగాన్ని జగన్ నాశనం చేశారని చంద్రబాబు ప్రజల్లో చైతన్యం కలిగించడంతో జగనులో భయం మొదలైంది. స్కిల్ కేసులో ఆధారాలేవీ..? స్కిల్ కేసులో ఎలాంటి ఆధారాల్లేవని నెల రోజుల తర్వాత ఏఏజీ చావు కబురు చెప్పారు. ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డులో అవినీతి అంటూ కేసులు పెట్టారు. రింగ్ రోడ్డు లేదు.. బొంగు రోడ్ లేదు. ఐఆర్ఆర్ కేసులో లోకేష్ ఉన్నారని గతంలో ప్రకటనలు చేశారు. ముందస్తు బెయిల్ కోసం లోకేష్ కోర్టుకెళ్తే.. ఆయనకేం సంబంధం లేదని ప్రభుత్వమే చెప్పింది. ఎలాంటి ఆధారాల్లేకుండా నెల రోజుల పాటు చంద్రబాబును జైల్లో పెట్టారు. గతంలో మాకు 160 స్థానాలు వస్తాయనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు జగన్ చేసిన తప్పులతో టీడీపీకి 175 స్థానాలు రావడం ఖాయమని క్లారిటీ వచ్చింది.’ అని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.
Also Read : NTR Balakrishna: బాబాయ్ కి పోటీగా అబ్బాయ్ దిగుతున్నాడా? ఇదెక్కడి ట్విస్ట్?