రాష్ట్రం కోసం చావడానికైనా సిద్ధం కానీ ఈ ప్రభుత్వం ఒత్తిళ్లకు లొంగమని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. మా కుటుంబాల మీద రోజా చేసిన వ్యాఖ్యలు ఆధారాలతో సహా ఇస్తాం మంత్రి మీద కేసు పెట్టే దమ్ము పోలీసులకు ఉందా అంటూ అయ్యన్న సవాల్ విసిరారు.
అనకాపల్లిలోని పరవాడ మండలంలోని వెన్నెలపాలెంలోని టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి బండారు ఇంటి దగ్గర పోలీసు యాక్షన్ మొదలైంది. బండారు ఇంట్లోకి పోలీసులు చొచ్చుకుపోయారు. ఆయనను తీసుకెళ్లేందుకు వచ్చిన అంబులెన్స్ను పోలీసులు అడ్డుకున్నారు.
ఇన్నేళ్లకు భువనేశ్వరికి తండ్రి గుర్తుకు రావడం ఆశ్చర్య మేస్తోందని తెలుగు అకాడమీ ఛైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. తల్లిదండ్రుల మీద గౌరవం ఉంటే నీ భర్త చేసిన లక్షల కోట్ల అవినీతి బయట పెట్టాలని ఆమె అన్నారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో రాయలసీమ ప్రాంతంలో కక్ష సాధింపు, ఫ్యాక్షనిజం, అక్రమ కేసులు పెట్టడం లాంటి రాజకీయాలను చూశామని, నెల్లూరు ప్రశాంతతకు మారుపేరు అని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లపై మంత్రి మేరుగ నాగార్జున విరుచుకుపడ్డారు. 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి మహాత్ముడి జయంతిన దీక్ష చేస్తాడట.. ప్రజాస్వామ్యం, స్వాతంత్య్ర ఉద్యమం మీద అవగాహన ఉంటే ఇలాంటి పనులు చేయడంటూ మంత్రి వ్యాఖ్యానించారు.
గాడ్సే కంటే ఘోరమైన వ్యక్తి చంద్రబాబు అని మంత్రి ఆర్కే రోజా అన్నారు. గాంధీని అవమానించేందుకు ఆయన దీక్ష చేస్తున్నారు అంటూ ఆమె మండిపడ్డారు. దీన్ని మేము ఖండిస్తున్నాము.. ప్రజలు చంద్రబాబును తరిమికొట్టాలి..
ఈ సారి ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమని జగన్ అంటున్నారని.. జగన్ ఓటమి ఖాయమని, మేం అధికారంలోకి రావడం ఖాయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో వారాహి విజయ యాత్ర బహిరంగ సభలో పవన్ ప్రసంగించారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, శ్రేణులు పెద్ద ఎత్తున మోత మోగిద్దం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక రాజమండ్రిలోని టీడీపీ క్యాంపు కార్యాలయం దగ్గర మోత మోగిద్దాం నిరసన కార్యక్రమంలో నారా బ్రాహ్మణి, తెలుగు మహిళలు పాల్గొన్నారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై చాలా కేసులున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇప్పటి వరకు చంద్రబాబు స్టేలు తెచ్చుకొని నెట్టుకొచ్చారు.. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో తప్పించుకోలేకపోయారు అని ఆయన విమర్శించారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో దోరికిపోయి జైల్లో కూర్చుంటే సిగ్గు లేకుండా చంద్రబాబు భార్య, ఆయన కోడలు గంట కొట్టండి, విజిల్స్ వేసి సీఎం జగన్ కు బుద్ది చెప్పండీ అంటున్నారు అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా బ్రాహ్మణి తెలియక మాట్లాడుతోందో.. తెలిసి అబద్ధాలు ట్వీట్ చేస్తున్నారా అనేది అర్థం కావాడం లేదని మంత్రి రోజా అన్నారు.