Nara Bhuvaneswari’s Nijam Gelavali Yatra Schedule Today: మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్ పర్సన్ నారా భువనేశ్వరి మూడు రోజుల పర్యటన నేటితో ముగియనుంది. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లాలో భువనేశ్వరి పర్యటించనున్నారు. ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో అనపర్తి, నిడదవోలు, కోవ్వూరు, గోపాలపురం, సీతానగరం, కోరుకొండ మండలాల్లో పర్యటిస్తారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించిన సమయంలో వేదనకు గురై మృతి చెందిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించి.. ఆర్థిక సహాయం అందించనున్నారు.
Also Read: Virat Kohli Record: విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలో ఒకే ఒక్కడు!
చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుతో వేదనకు గురై కొంతమంది మరణించడంతో వారి కుటుంబాలను పరామర్శించేందుకు నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా బుధవారం నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆమె పర్యటిస్తున్నారు. నేటితో భువనేశ్వరి మూడు రోజుల పర్యాటన ముగియనుంది. రాత్రి బలభద్రపురంలో బస చేసిన భువనేశ్వరి.. ఈ సాయంత్రం రాజమండ్రి ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి విమానంలో హైదరాబాద్ చేరుకుంటారు.