Ex MLA Yamini Bala: వైసీపీకి మరోషాక్.. మాజీ ఎమ్మెల్యే రాజీనామా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ex MLA Yamini Bala: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలినట్టు అయ్యింది.. వైసీపీకి రాజీనామా చేశారు మాజీ ఎమ్మెల్యే యామిని బాల.. ఓ విడియో విడుదల చేసిన ఆమె.. తాను వైసీపీకి గుడ్‌బై చెబుతున్నట్టు పేర్కొన్నారు.. ఇంత కాలం తనకు సహకరించిన పార్టీ శ్రేణులు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.. వైసీపీకి రాజీనామా చేశాను.. రాజీనామా లేఖను వైసీపీ అధిష్టానానికి, పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి ఫ్యాక్స్ చేసినట్టు చెప్పుకొచ్చారు. కాగా, ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచి శింగనమల టికెట్ ఆశించి భంగపడ్డారు యామిని బాల.. దీంతో, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆమె.. ఇప్పుడు రాజీనామా చేశారు.. మరి ఏ పార్టీలో చేరతారు అనే విషయం తెలియాల్సి ఉంది.
Read Also: Pakistan Cricket Team: పాకిస్థాన్ ఆటగాళ్లకు స్నైపర్ ట్రైనింగ్.. వీడియో వైరల్
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
కాగా, 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా శింగనమల నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు యామిని బాల.. అప్పుడు ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది.. కానీ, 2019 ఎన్నికల్లో అప్పటిదాకా ఎమ్మెల్యేగా ఉన్న యామినిబాలకు బదులు కొత్తగా వచ్చిన బండారు శ్రావణికి అవకాశం కల్పించారు చంద్రబాబు.. అయితే, తన కుమార్తెకు టికెట్ కోసం చివరి వరకు టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న శమంతకమణి ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది.. దీంతో.. టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి, ఆమె కూతురు మాజీ ఎమ్మెల్యే యామిని బాల.. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో.. టీడీపీకి రాజీనామా చేసి.. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.. ఇప్పుడు వైసీపీ టికెట్ దక్కకపోవడంతో.. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. తన రాజకీయ భవిష్యత్తుపై యామిని బాల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సి ఉంది. కాగా, శింగనమల నియోజకవర్గానిక ఓ ప్రత్యేక ఉంది.. అక్కడ ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తే.. ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఉంది.. గతంలో చాలా సార్లు అది రుజువైంది కూడా. మరి ఈ సారి ఎలాంటి ఫలితాలు వస్తాయో వేచిచూడాలి..
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!