రాష్ట్రంలో రౌడీ రాజ్యం పాలిస్తుందని రాజారెడ్డి రాజ్యాంగం పోయి అంబేద్కర్ రాజ్యాంగం రావాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఉదయగిరి తెలుగుదేశం- జనసేన- బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు. వింజమూరు మండలం లోని కాటేపల్లి, రావిపాడు పంచాయతీలలో పల్లె పల్లెకు కాకర్ల ఇంటింటి ప్రచారాన్ని ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లె ప్రజలు బ్యాండ్ మేళం బాణా సంచాలు పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా నీరాజనాలు పలుకుతూ సురేష్ అన్న నీ వెంటే మేము అంటూ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రతి ఇంటికి తిరిగి సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగు దేశాన్ని గెలిపించాలని కాకర్ల సురేష్ అభ్యర్థించారు.
Read Also: Allu Arjun: ఆ షాట్ కోసం బన్నీ 51 టేకులు తీసుకున్నాడా?
ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. పురిటిగడ్డపై మమకారంతో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు వచ్చానని ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి.. పేదల జీవితాలు మారుస్తానని ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చేసిన అభివృద్ధి మాత్రమే పల్లెల్లో కనిపిస్తుందని చెప్పారు. గత 40 సంవత్సరాలుగా పాలిస్తున్న మేకపాటి కుటుంబం వల్ల ఎక్కడి వేసిన గొంగళి అక్కడే ఉంది తప్ప ముందుకు పోలేదన్నారు. మార్పు కావాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా.. ప్రజల ఆరోగ్యం కోసం పాటుపడుతున్న కాకర్ల సురేష్ అను నన్ను సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్ర వేసి గెలిపించాలని ఆయన కోరారు. మాధవ నగర్ లో పేదల కోసం నిర్మిస్తున్న వాటర్ ప్లాంట్ ను రాజకీయం చేస్తున్నారన్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో మినరల్ ప్లాంట్ లో ఏర్పాటు చేస్తామని కాకర్ల సురేష్ వెల్లడించారు.
Read Also: Naga Bandham: కేజీఎఫ్ నటుడితో నాగబంధం.. ఇదేదో ఇంట్రెస్టింగ్‌గా ఉందే!
అలాగే, పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమంలో భాగంగా వింజమూరు మండలం నల్లగొండ్ల గ్రామంలో ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఇంటింటికి తిరిగి సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశాన్ని గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా నల్లగొండ్ల గ్రామానికి చెందిన సుమారు 100 కుటుంబాల నాయకులు అన్నపురెడ్డి మురళీధర్ రెడ్డి, భోగి రెడ్డి సుబ్బరాయుడు, అన్నపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి, వీరం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీనివాసులు, జీ గంగయ్య, వీరం రెడ్డి చిన్న కృష్ణయ్య, వీరం రెడ్డి పెంచలమ్మ, అన్నపరెడ్డి గణేష్, అన్నపురెడ్డి రత్నారెడ్డి, అంకినపల్లి ఓబుల్ రెడ్డి ఆధ్వర్యంలో ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
Read Also: Elections 2024: ఎన్నికల సంఘం నిర్ణయం.. ఇకపై అక్కడ ‘పోలింగ్’ వెహికిల్స్‌కు జీపీఎస్..!
ఇక, వింజమూరు మండలం గుండె మడగల గ్రామంలో పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కాకర్ల సురేష్ కు హారతులు ఇచ్చారు. ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలని కాకర్ల అభ్యర్థించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి మనకు భవిష్యత్తును తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, మండల కన్వీనర్ గొంగటి రఘునాథరెడ్డి, మాజీ కన్వీనర్ గూడా నరసారెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి చల్లా వెంకటేశ్వర్లు యాదవ్, వనిపెంట సుబ్బారెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ దంతులూరి వెంకటేశ్వరరావు, కోడూరు నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శి చల్లా శ్రీనివాస్ యాదవ్, గణపం సుదర్శన్ రెడ్డి, పాములపాటి మాల్యాద్రి, భయ్యపు రెడ్డి కేశవులు రెడ్డి, అంకినపల్లి శివ శంకర్ రెడ్డి, కే శ్రీనివాసులు నాయుడు, వేమూరి దొరస్వామి నాయుడు, కుంకు కొండయ్య నాయుడు, శ్రీహరి నాయుడు, గాలి నరసపనాయుడు, గాలి రామ్మోహన్ నాయుడు, దాట్ల కృష్ణారెడ్డితో పాటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.