ఏపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ, వైసీపీ ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తుకుంటూ పొలిటికల్ హీట్ పెంచేస్తున్నారు. ఎలక్షన్ కోడ్ పరిధి దాటి వ్యవహరిస్తున్నారంటూ రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసుకుంటున్నాయి.
వారాహి యాత్రకు వచ్చినపుడు ఇక్కడ మంత్రి రోజు అన్నం పెట్టే రైతుని ఏడిపించిన విధానం నన్ను బాధించింది.. రైతు కంట కన్నీరు పెట్టించిన మంత్రి ఆయన కొడుకు తుడిచిపెట్టుకుపోవాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. నాకు అనుభవం ఉంది.. పవన్ కళ్యాణ్ కు పవర్ ఉందన్నారు. రాష్ట్రంలో అగ్నికి వాయువు తోడు అయ్యింది.. ప్రజాగళంకు వారాహి తోడు అయ్యింది.. సైకిల్ స్పీడుకు తిరుగు లేదు.. గ్లాసు జోరుకు అడ్డు లేదు అని పేర్కొన్నారు.
చరిత్రలో నిలిచిపోయే సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పని చేశారు.. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఎన్టీఆర్ లు కూడా ప్రజల కోసం పని చేశారు అని పేర్కొన్నారు. వాళ్ళిద్దరికి మించి, ప్రతి ఇంటికి చేరువైన ముఖ్యమంత్రిగా సీఎం జగన్మోహన్ రెడ్డి పేదల మనసు గెలిచారు అని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వెల్లడించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విజయవాడ సెంట్రల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ మొదట ముఖ్యమంత్రి అన్నాడు.. ఆ తర్వాత మంత్రి అన్నాడు.. ఇప్పుడు ఎమ్మెల్యే చేయమంటున్నాడు.. ఎమ్మెల్యే స్థాయికి వచ్చాడు రేపు కార్పొరేటర్ స్థాయికి వస్తాడు అని పేర్కొన్నారు.