ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజకీయ వాతావరణం నెలకొని ఉంది. దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరుగుతుండగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అసెంబ్లీ మరియు లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక రాష్ట్రంలో ఇప్పటికే అన్ని పార్టీల వారు వారి నియోజకవర్గ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల సభలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు ఎలక్షన్స్ నేపథ్యంలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. ఇప్పటికే పార్టీల పెద్దలు రాష్ట్ర మొత్తం సుడిగాలి పర్యటనలు చేస్తూ దూసుకెళ్తున్నారు. Also Read: Inflation :…
గుంటూరు జిల్లాలోని ఏటుకురులో నిర్వహిస్తున్న మేమంత సిద్ధం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ జన సముద్రాన్ని చూస్తే మరో ప్రపంచం కనిపిస్తుందన్నారు. ఈ జన ప్రభంజనం చరిత్రలో నిలిచిపోతుంది.. ప్రతి ఇంటి చరిత్రను కొత్త బంగారు లోకానికి తీసుకెళ్తుంది.. మన ప్రభుత్వానికి మద్దతుగా జరుగుతున్న మంచిని కాపాడుకునేందుకు మంచినీ కొనసాగించేందుకు వైసీపీకి మద్దతు పలికిన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నాను అని ఆయన చెప్పుకొచ్చారు.
నెల్లూరు జిల్లా కోవూరు మండలం మోడేగుంట గ్రామంలో కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక ఈ సభలో ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. మొదటి నుండి తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న వాళ్ళను పక్కనపెట్టి ఒక కోటేశ్వరాలిని నాపై పోటీకి పెట్టారు. జగన్ ద్వారా లబ్ధి పొంది ఆరు సంవత్సరాలు రాజ్యసభ పదవిని వేమిరెడ్డి అనుభవించారు. నెల్లూరులో ఓ మైనార్టీ కి వైసీపీ తరఫున టికెట్ ఇచ్చారని అలిగి పార్టీని వదిలి…
ఈ పొత్తు సహితం కాదని కొంతమంది పనికిమాలిన మంత్రులు మాట్లాడడం హాస్యాస్పదంగా భావిస్తున్నామని గన్నవరం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. గన్నవరం టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
రేపటి నుంచి బాలకృష్ణ రాష్ట్ర పర్యటన ప్రారంభం అవుతుందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు వెల్లడించారు.. ఇక, బాలయ్య యాత్ర కోసం ప్రత్యేక బస్సును సిద్ధం చేశారు.. ''స్వర్ణాంధ్ర సాకార యాత్ర'' పేరుతో నందమూరి బాలకృష్ణ బస్సు యాత్ర నిర్వహించనున్నారు..
‘ఎవరైనా సరే ఒక వ్యక్తికి నమస్కారం పెట్టే స్థాయి నుంచి, మరో 10 మందికి స్ఫూర్తిగా ఎదిగే స్తాయికి ఎదగాలి. ప్రభుత్వం అనేది సంక్షేమం అందజేసి చేతులు దులుపుకోకూడదు, స్వయంగా సంపాదించుకునేలా ఉపాధి అవకాశం కల్పించాలి.’ అని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.