మేమంతా మౌనంగా ఉన్నాం.. అనవసరంగా వివాదాలు సృష్టించొద్దు.. మేం దణ్ణం పెట్టి చెబుతున్నాం.. హత్యలు, దాడులకు దూరంగా ఉండాలి అని విజ్ఞప్తి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. మీ దాడులకు మా రియక్షన్ వేరేలా ఉంటే టీడీపీ నేతలు తట్టుకోలేరు అని హెచ్చరించారు.
జగన్ ఒక బచ్చా అని కూడా చంద్రబాబు అంటున్నాడు.. చంద్రబాబు మాటలు చూస్తే కృష్ణుడిని బచ్చా అనుకున్న కంశుడు గుర్తుకు వస్తున్నాడు అని దుయ్యబట్టారు సీఎం జగన్.. హనుమంతున్ని బచ్చా అనుకున్న రావణుడికి కూడా ఏమైందో చూశాం... పేదలకు మంచి చేసి వుంటే బచ్చాను చూసి భయపడి 10 మందిని ఎందుకు పోగేసుకుంటున్నావు? అంటూ సెటైర్లు వేశారు.
బనగానపల్లె కోటపై టీడీపీ జెండా ఎగరడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్‌రెడ్డి.. నంద్యాల జిల్లాలో నామినేషన్ల పర్వం ఊపందుకోగా.. బనగానపల్లె నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డి.. గెలుపే దిశగా మరో ముందడుగు వేశారు.. ఈ రోజు కుటుంబసభ్యుల సమక్షంలో అత్యంత నిరాడంబరంగా నామినేషన్ దాఖలు చేశారు.. వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిని చిత్తుగా ఓడిస్తానన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
కర్నూలు జిల్లా కూటమిలో మంటలు చల్లారడం లేదు. కూటమిలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎమ్మిగనూరు, మంత్రాలయంలో టీడీపీతో మిత్రపక్షాలు ఢీకొట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
జనసేనలో అనుభవం ఉన్న ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి వైసీపీలోకి రావడం హర్షణీయమని నెల్లూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి అన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి వైసీపీలోకి రావడాన్ని చూస్తే జనసేన ఎంత బలహీనంగా ఉందో అర్థమవుతుందన్నారు.