Anjuru Srinivasulu: శ్రీకాళహస్తి దేవస్థానంపై బురద చల్లడం తగదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anjuru Srinivasulu: శ్రీకాళహస్తి దేవస్థానంపై బురద చల్లోద్దని.. రాజకీయ ఆరోపణలు మానుకోవాలని దేవస్థాన పాలక మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు అన్నారు. ఆలయం నుంచి వెండి తీసుకువెళ్లి బెంగళూరులో విక్రయించి.. ఆ సొమ్ములు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి కుటుంబానికి ఇచ్చినట్లు ఆరోపణలు చేస్తున్న హేమచంద్ర రెడ్డి మాటలను ఆయన ఖండించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ప్రతిష్ట దెబ్బతినే విధంగా రాజకీయ అవసరాల కోసం ఆరోపణలు చేయొద్దని బొజ్జల సుధీర్ రెడ్డిని హెచ్చరించారు. దేవస్థానం నుంచి సూది సైతం అనుమతి లేకుండా బయటకు తీసుకెళ్లడానికి ఏమాత్రం అవకాశం లేదని.. నిర్దిష్ట ఫిర్యాదు అందితే సమగ్ర విచారణకు దేవస్థానం సిద్ధమే అన్నారు.
READ MORE: AP BJP: ఏపీకి రేపు కేంద్ర మంత్రుల రాక
ప్రపంచ ఖ్యాతి పొందుతున్న దేవస్థానంపై బురద చల్లడం తగదన్నారు. ఆలయం నుంచి సూది తీసుకువెళ్లాలన్నా తప్పనిసరిగా ఎస్పీఎఫ్ పోలీసుల అనుమతి ఉండాలని.. అలాంటిది వెండి తీసుకెళ్లడం ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. ఈ ఆరోపణలపై తమకు గానీ, ఈవోకు గాని నేరుగా ఫిర్యాదు అందలేదన్నారు. తిరుపతిలో ఎస్పీకి ఫిర్యాదు చేశామని చెప్పారు.. కానీ తిరుపతి ఎస్పీ నుంచి శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి ఎలాంటి విచారణ నోటీసు రాలేదన్నారు. దేవస్థానంలో ఏదైనా అవకతవక జరిగి ఉంటే నిర్దిష్ట ఫిర్యాదిస్తే దానిపై విచారణకు వెంటనే ఆదేశిస్తామని తెలిపారు.
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి దేవస్థానంపై ఆరోపణలు చేయడం, ఆందోళన చేస్తా, ముట్టడి చేస్తాం అనడం తగదన్నారు. గతంలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఎంతో హుందాగా వ్యవహరించి మంచి పేరు తెచ్చుకున్నారని గుర్తు చేశారు. హెచ్చరికలు, జాగ్రత్త అంటూ బెదిరించడం గమనిస్తే ఆయన తీరు తీవ్ర ఆక్షేపనీయమన్నారు. శ్రీకాళహస్తి ప్రజలు రౌడీయిజాన్ని సహించరని సామ్యలు మంచివారిని మాత్రమే ఆదరిస్తారనేది గుర్తుపెట్టుకోవాలన్నారు.
Also Read
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- OTR: లోకల్ ఎలక్షన్స్‌లో జనసేనకు టీడీపీ షాక్? సీట్లపై కోల్డ్ వార్
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
- CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..