జనసేనలో అనుభవం ఉన్న ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి వైసీపీలోకి రావడం హర్షణీయమని నెల్లూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి అన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి వైసీపీలోకి రావడాన్ని చూస్తే జనసేన ఎంత బలహీనంగా ఉందో అర్థమవుతుందన్నారు.
ఏపీలో ఎన్నికల వేళ.. ఈసీ వద్ద వివిధ పార్టీల ఫిర్యాదులతో పంచాయతీ నెలకొంది. ప్రతి ఎన్నికల్లోనూ ఉండే తరహాలోనే ఈ ఎన్నికల్లోనూ ఒకరిపై ఒకరు ఈసీకి అధికార-ప్రతిపక్ష పార్టీలు పరస్పర కంప్లైంట్లు ఇచ్చుకుంటున్నారు. షెడ్యూల్ విడుదల కాక ముందు నుంచి వైసీపీ - టీడీపీ పార్టీలు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నాయి.
సీఎం జగన్ను చంపడానికే రాయి విసిరారని రిమాండ్ రిపోర్టులో కూడా రాసేశారు. దీంతో.. ఇప్పుడు ఈ వ్యవహారం అటు తిరిగి.. ఇటు తిరిగి తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోననే ఆందోళన టీడీపీ వర్గాల్లో పెరుగుతోందట. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద హత్యాయత్నం అంటే మామూలు విషయం కాదు. మొన్నటి వరకు నిందితుడి ఎవరో తెలీదు.. ఎవరో రాయి విసిరారు.. అది కూడా సరిగా కన్పించ లేదు... ఇదంతా ట్రాష్.. ఒట్టి డ్రామా అని కొట్టిపారేసిన టీడీపీ నేతల్లో..…
నామినేషన్ పత్రాల్లో నందమూరి బాలకృష్ణ పేర్కొన్నప్రకారం ఆయనకు రూ.9 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయి.. ఎన్నికల అఫిడవిట్లో బాలయ్య చూపిన ఆస్తుల వివరాల విషయానికి వస్తే.. బాలకృష్ణ ఆస్తుల విలువ రూ.81 కోట్ల 63 లక్షలు... ఆయన భార్య వసుంధర ఆస్తుల విలువ రూ.140 కోట్ల 38 లక్షల 83 వేలు.. ఇక, ఆయన కుమారుడు మోక్షజ్ఞ ఆస్తుల విలువ రూ.58 కోట్ల 63 లక్షల 66 వేలుగా ఉంది..
టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. అమెరికా నుంచి ఆంధ్రాకు వచ్చిన వాళ్లం విజయవాడ నుంచి తెనాలికి మాత్రం రాలేమన్నారు. గోతులతో నిండిన ఈ రోడ్లపై ప్రయాణించాలంటే ప్రాణాంతకంగా ఉందని ప్రభుత్వ తీరును ఆయన విమర్శించారు.
గన్నవరం నియోజకవర్గం రామవరప్పాడులో ఈరోజు M కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన ఉత్తరాంధ్ర ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా గన్నవరం నియోజవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు , ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మూడు పార్టీలు సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని నాయకులకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ పరిశీలకులు మరియు ఇన్చార్జ్ ఆకుల వెంకట నాంచారయ్య,…