sanyasi Patrudu: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడుకి.. అతడి తమ్ముడు సన్యాసి పాత్రుడుకి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మరోసారి అయ్యన్న పాత్రుడుకి అతడి తమ్ముడు ఛాలెంజ్ విసిరాడు. నర్సీపట్నంలో మరి డిమాంబ అమ్మవారి జాతరలో అన్నదమ్ములు కుటుంబాల మధ్య రచ్చ నెలకొంది. ఈ రచ్చలో భాగంగా సన్యాసి నాయుడు తన అన్నయ్యపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నీ జీవిత రహస్యాన్ని విప్పుతా.. కాసుకో.. ఒక్క ఓటుతో అయినా గణేష్ ను మరోసారి గెలిపించి మంత్రిగా నర్సీపట్నం తీసుకొస్తానని ఛాలెంజ్ విసిరారు. తనకు గణేష్ గెలుపే ముఖ్యమని.. అయ్యన్న నాశనాన్ని కోరుకుంటున్నానన్నారు. అయ్యన్న చనిపోతే ఇక ఆయన కుటుంబమే ఉండదన్నారు. కుటుంబాలపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని.. దమ్ముంటే చర్చకురమ్మని సవాల్ విసిరారు.
READ MORE: Tammy Beaumont: బాయ్‌ఫ్రెండ్‌తో పెళ్లి కానిచ్చేసిన స్టార్ క్రికెటర్..
అమ్మవారి దర్శనానికి వెళితే మైలతో వచ్చానని బ్రోకర్లతో ఆరోణలు చేయించారని సన్యాసి పాత్రుడు మండిపడ్డారు. ప్రజల సొమ్ముతో చేయించిన అమ్మవారి నగలను దేవాదాయ శాఖ అధికారులకు అప్పగించేసినట్లు తెలిపారు. తనకు చిత్త శుద్ధి ఉంటే.. తాను కూడా అమ్మవారి సొమ్ము ఆరు రూ.6 లక్షల రూపాయలు అధికారులకు అప్పగించాలన్నారు.