175 శాసనసభ స్థానాలలో పోటీలో 124 మంది సంపన్నులు అని, బీజేపీ అవినీతి కూటమిగా మారిపోయిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ మేనిఫెస్టో సూపర్ సిక్స్ కాదు చీటింగ్ సిక్స్ అని ఆయన వ్యాఖ్యానించారు. పెన్షన్లు, సంక్షేమ పథకాలు ఇస్తే జాతీయ వనరులన్నీ వృధా అయిపోతాయని ఆయన వ్యాఖ్యానించారు. సోమరులు అయిపోతారు అని చెప్పిన పార్టీ టీడీపీ అని, వైసీపీ సంక్షేమాలు పథకాలు కొనసాగిస్తాం.. 2 వేలో 3 వేలో పెంచుతాం అని డబ్బా కొట్టుకున్న టీడీపీ, ప్రజలకి ఎంత పంచుతారో చెప్పారు… ఎంత వసూలు చేస్తున్నారో చెప్పలేదన్నారు. 12 కేటగిరీల్లో కేరళ మొదటి స్థానంలో ఉంది.. ఆంధ్రప్రదేశ్ ఎక్కడ? అని ఆయన ప్రశ్నించారు. వైఎస్ఆర్సిపి మేనిఫెస్టోలో ఇరిగేషన్ మాటే లేదని, ఒక రాజధాని కూడా లేకుండా చేసిన ఘనత వైసీపీది అని ఆయన అన్నారు. రాజధాని విషయంలో జనాలకి 3D చూపించి చేతులు దులుపుకుంది టీడీపీ అని ఆయన విమర్శించారు. రాజధాని విషయంలో ప్రజలు చంద్రబాబుని నమ్మరు.. భూములు లేవు పంటలు లేవు అని ఆయన ధ్వజమెత్తారు.